Vivek Venkataswamy Slams BRS Over Lack of Development
తండ్రి కేసిఆర్,అన్న కేటీఆర్ పదేండ్లలో అభివృద్దేమో శూన్యం..
కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తండ్రి కేసిఆర్, అన్న కేటీఆర్ అని గొప్పలు చెప్పుకునే చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి, చెన్నూర్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎద్దేవచేశారు.శుక్రవారం ఆయన క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లోని 1,2,7,8,9,12,13,14,17 వార్డులలో రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శంకుస్థాపనలు చేశారు. సుమారు 45 కోట్ల టి,యు,ఐ,ఎఫ్డిసి, సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి, సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి తన జీవితం అంకితం చేస్తున్నానని తెలిపారు. కమీషన్ల కోసం పనిచేసే ఎమ్మెల్యేను కాదని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మునిసిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు,పార్టీ కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
