
"Farmers Seek Relief After Rain Damage"
వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
పి ఎ సి ఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొరంచ వెంబడి నీట మునిగిన వరి పొలాలను అంచనవేసి రైతులకు నష్టపరిహారం అందించాలని గణపురం మాజీ సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని పొలాల్లో ఇసుక దిబ్బలు పెరికపోయాయని, పత్తి పంట నష్టం జరిగిందని పంట నష్టం విషయంలో ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు పూర్ణచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీలో పాలకవర్గాలు లేక వర్షాల కారణంగా దోమల నివారణలో జాప్యం జరుగుతుందని అధికారులు వెంటనేc స్పందించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కోరారు.