నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపైప్రభుత్వం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు.గురువారంచండూరు మండల కేంద్రంలోసిపిఎం మండల కమిటీ సమావేశంసిపిఎం సీనియర్ నాయకులుచిట్టిమల్ల లింగయ్య అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,నకిలీ విత్తనాలు సరఫరా చేసే విత్తన కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించి, రైతాంగాని ఆదుకోవాలనిఆయన అన్నారు.ప్రభుత్వమే రైతులకు యంత్ర పరికరాలను 50% సబ్సిడీపై, దళిత, గిరిజన, సన్న కారు రైతాంగానికిప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలనిఆయన ప్రభుత్వాన్ని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకురెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, నేటికీ అమలు చేయలేదని, రైతులకు పంట రుణాలను వెంటనే ఇవ్వాలని,కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం అందివ్వాలని దాని ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలనివారు డిమాండ్ చేశారు.ఎన్నికల ముందుకాంగ్రెస్ ప్రభుత్వంరైతులకు ఇచ్చిన హామీలనువెంటనే అమలు చేయాలనిఆయన అన్నారు. పెండింగ్ లో ఉన్న రైతుబంధు, రైతులకు హామీ ఇచ్చిన రుణమాఫీ, ఎంతైతేరుణ మాఫీ అవుతుందో, తిరిగి మళ్లీనూతన పంట రుణాలునాబార్డ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంరుణ పరిమితిని పెంచిరైతులకు పంట రుణాలు ఇచ్చిఆదుకోవాలన్నారు.ఈ సంవత్సరం రైతాంగానికి ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, చండూరు మండల సహాయ కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ గౌడ్,కొత్తపల్లి నరసింహ,గౌసియా బేగం,రవితదితరులు పాల్గొన్నారు.