తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్
మంచిర్యాల, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామంలో కొండు బానేష్ మాట్లాడుతూ ఖరీఫ్ పంట సాగులో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని అనేక కంపెనీలు రైతులను మోసం చేసినందుకు దళారీల తోని విత్తనాలు అమ్మించి రైతులను మోసం చేయటం జరుగుతుందని దీనిపై అధికారులు నిరంతరం దృష్టి సారించి నకిలీ విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం నుండి రైతులకి అవసరమైన విత్తనాలు రైతులందరికీ ఇవ్వాలని అలాగే దళారీలకు కఠినమైన శిక్షలు ఉండాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో
ఇందారపు రాజేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు రైతు సంఘం,
చదువుల దుర్గమ్మ బెల్లంపల్లి మండల ఉపాధ్యక్షులు రైతు సంఘం,
ఎటకారి శంకరమ్మ, పోతుల వేణి లక్ష్మీకాంత, ఎటకారి పుల్లక్క, పంబాల అంజి, జక్కం రాజు, ఎటకారి అంజి బాబు, తదితరులు పాల్గొన్నారు.