రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: మిల్కురి వాసుదేవరెడ్డి

రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: మిల్కురి వాసుదేవరెడ్డి

రైతు తనకు ఇష్టం వచ్చిన పంటను పండించుకునే హక్కు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతును వరి పండించవద్దని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. తాలు, తప్పా, నిమ్ము పేరుతో కొర్రీలు పెడుతున్నారన్నారు. పార్టీకి ఓటు వేయలేదని కొందరు సెంటర్ నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని తెలిపారు. కొనుగోలు చేసిన వారం లోపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేయాలని చెప్పారు. తాలు పేరుతో రైస్ మిల్లర్లు సంచికి 5 కిలోలు కోత విధిస్తూ రైతు నడ్డి విరుస్తున్నారన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏక కాలంలో రుణాలు మాఫి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రే వరి పంట వేయొద్దని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రైతాంగం పై ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆ మాటలు వెనక్కి తీసుకుని రైతుల్లో ఆందోళన తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతాంగం అంతా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వరి వేయరాదని గత యాసంగి మరియు ఈ వానాకాలం కొనుగోలు చేయనన్న ప్రభుత్వం 6,300 కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చిందని. గత యాసంగిలో 92 లక్షల టన్నుల వడ్లు కొన్నారని. ఈ వానాకాలం కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ విధానం ప్రకటించకున్నా.. ఏలాంటి జీ.ఓలు రాకున్నా ప్రభుత్వ విధానాన్ని ప్రకటించడం చట్ట విరుద్దమన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ మరోరకం బియ్యం కొనుగోలు చేయవద్దని ఎఫ్సిఐ ద్వారా ఉత్తర్వులు ఇప్పించడం అది బహిర్గతం కావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దోబూచులాటకు నిదర్శనంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల్లో భాగంగానే వరి పంటపై ఆంక్షలు విధించినట్లు కనబడుతుందని. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదన్నారు.

రాష్ట్రంలో కోటి ఏకరాల మాగాణం చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రస్తుతం వానాకాలం, యాసంగి కలిపి 80 లక్షల ఎకరాల నుండి కోటి ఎకరాలకు పెరిగిందన్నారు. ఈ వానాకాలం 62 లక్షల ఎకరాలలో వరి వేశారని గత 3 సంవత్సరాలుగా వర్షాలు విపరీతంగా పడడంతో భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. ప్రాజెక్టులలో, చెరువు, కుంటలలో పుష్కలంగా నీరు ఉందని నీరు బాగా ఉన్నపుడు మెట్ట పంటలు పండవని ఒక వేళ వేసిన మొలకెత్తవని. పైగా యాసంగిలో ఉలవలు, సెనగలు, నువ్వులు, ఆముదం పంటలు వేసినా.. అవి దిగుబడులు రాకపోగా… పెట్టిన పెట్టుబడి కూడా రాదని పైగా విత్తనాలు కూడా అందుబాటులో లేవన్నారు. ఇలాంటి స్థితిలో వ్యవసాయ శాఖ మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించి అందుకు తగిన విత్తనాలను అందుబాటులో పెట్టి ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇంకో వైపు ఈ సంవత్సరం 802 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు నేెషనల్‌ క్రైమ్‌ బ్యూరో ప్రకటించిందని. ఇది కూడా ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించలేదన్నారు. వెంటనే ప్రభుత్వం అధికారికంగా విధానాన్ని ప్రకటించి విత్తనాలు అందుబాటులో పెట్టి వరిపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వరి పంటపై రైతుల్లో గందరగోళాన్ని సృష్టిస్తూ ద్వంద విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలకు పూనుకోవాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక చర్యలు నిరసిస్తూ వరి పంటపై ఆంక్షలు ఎత్తివేయాలని జరుగుతున్న ఉద్యమాల్లో రైతులు రాజకీయలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు శీలం అశోక్, చెల్పూరి రాములు, కరంకొండ శ్రావణ్, పెరుమాండ్ల ప్రవీణ్, రావుల ఓదేలు, పుల్ల కరుణాకర్, హరీష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *