
# సాగునీరు అందక ఎందుతున్న పంటలు.
# మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన దీక్ష కార్యక్రమం.
నర్సంపేట,నేటిధాత్రి :
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో
సకాలంలో పంటలకు సాగునీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని అందుకు నిరసన నేడు నర్సంపేట నియోజకవర్గం కేంద్రంలో రైతు నిరసన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.అందుకు గాను మాజీ ఎమ్మెల్యే ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
నియోజకవర్గంలో పలు రకాల పంటలకు సాగునీరు అందక ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయని వెంటనే పంటలకు సరిపడా నీళ్లు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న మిర్చి, ఇతర పంటలకు నష్టపరిహారం కింద రూ.25 వేలు చెల్లించాలని,వరి, మొక్కజొన్న పంటలతో పాటు ఇతర పంటలకు ఎన్నికలలో ఒప్పుకున్న ప్రకారం క్వింటాల్ కు రూ.500 బోనస్ అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు, రూ. 2 లక్షల రుణమాఫీ చేసి రైతు బీమా, రైతుబంధు, కౌలు రైతును ఆదుకోవడం ,వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని అర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద 9 గంటలకు రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపదుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది తెలిపారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ రైతులు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అన్ని అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు.