
Farewell
పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి విజయాలు సాధించాలి… ప్రధానోపాధ్యాయులు బద్రి నారాయణ
మహబూబాబాద్/ నేటి ధాత్రి:
మండలంలోని మాధవాపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంకా బద్రి నారాయణ మాట్లాడుతూ ,”విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ ను అలవర్చుకోవాలని, తమ భవిష్యత్తు తమ నడవడికపై ఆధారపడి ఉందని, మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా సరైన ప్రణాళికతో తమ లక్ష్యాన్ని చేరుకోవాలని అభిలాషించారు. పదవ తరగతి పరీక్షలను ఎలాంటి భయము, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు మరియు 10వ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు ఐదువేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు”.
ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని రాబోయే కామన్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయ బృందం స్నేహలత, నాగయ్య, రమాదేవి, పరమాత్మ చారి బాబురెడ్డి, సుజాత, సౌభాగ్య, హైమావతి, మమత పాల్గొని విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు.