`డిప్యుటేషన్లు రద్దుచేస్తూ ఫిబ్రవరి 7న ప్రభుత్వ ఉత్తర్వులు
`ఉత్తర్వుల్లో లసుగుల ఆధారంగా ఎక్కడివారక్కడే కొనసాగుతున్న వైనం
`విల్లింగ్ లెటర్లే వారికి బ్రహ్మాస్త్రం
`డిప్యుటేషన్లు రద్దుచేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు నిర్వీర్యం
`‘విల్లింగ్’ల పేరుతో ఇప్పటికే జాగ్రత్తపడిన చాలామంది డాక్టర్లు
`లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు
`రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే వైద్యశాఖలో ఈ వైపరీత్యం
`ఉత్తర్వులో లోపంతో నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
చక్రం తిప్పుతున్న మంత్రులతో ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ
హైదరాబాద్,నేటిధాత్రి:
వైద్యో నారాయణో హరి అనేది నానుడి. కానీ ప్రస్తుతం అందుకు పూర్తి భిన్న పరిస్థితి కనిపిస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు వైద్యాధికార్లు, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కొందరు ఏకంగా సొంత ఆసుపత్రులనే న డుపుతుండటం వర్తమాన చరిత్ర. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం జి.ఓ.ల రూపంలో చర్యలు తీ సుకున్నా ఎంతమాత్రం ఫలితం ఉండటంలేదన్నది ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న ప్రహసనాన్ని చూస్తే అర్థమవుతుంది.
ప్రభుత్వాలు మారుతుంటాయి. అధికారాన్ని చేపట్టే ప్రతి కొత్త ప్రభుత్వం ఏదో చేయాలన్న తపనతో ముందుకెళ్లడం సహజమే. ఇందుకోసం తనద్కెన శ్కెలిలో ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహి స్తుంటుంది. ఇందుకు అవసరమైన జి.ఓ.లను ఎప్పటికప్పుడు జారీచేస్తుంటుంది. వీటి ఉద్దేశం మంచిద్కెనప్పటికీ, అక్రమాలకు పాల్పడేవారు వీటిల్లో రంధ్రాన్వేషణ చేసి, తద్వారా సదరు జి.ఓ. ల ప్రభావం తమపై పడకుండా జాగ్రత్తపడుతుంటారు. ఇది అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ జరిగే అతి సహజమైన పరిణామం. నిజాయతీపరులు జి.ఓ. ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ దిశగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తే, అవినీతిపరులు మాత్రం అందులో లసుగులకోసం వెతుకుతూ, ఏ చి న్న లోపం కనిపించినా, తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తుంటా రు. ఇప్పుడు సరిగ్గా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న తంతు ఇదే. వివరాల్లోకి వెళితే…
ఎంతోకాలంగా డిప్యుటేషన్ పేరుతో వివిధ జిల్లాల్లో తిష్టవేసిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులను తిరిగి తమ స్వస్థానాలకు తిరిగి వెళ్లాల్సిందిగా ఈ ఏడాది ఫిబ్రవరి 7న వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (హెచ్.ఎం ఎఫ్.డబ్ల్యు) ఉత్తర్వులు జారీచేసింది. అంతవరకు బాగానే ఉంది. దీని ప్రకారం డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులు గతంలో పనిచేసిన తమ స్వస్థానాల కు తిరిగి వెళ్లిపోవాలి. ఇందులో విశేషమేముందని ఎవరైనా సాధారణంగా అభిప్రాయ పడతా రు. ఎందుకంటే డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగి ఏడాదికి మించి అక్కడ పనిచేయడానికి ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకోవు. కానీ మన ప్రభుత్వాల నిర్వాకంవల్ల ఎంతోమంది ఎన్నో ఏళ్లుగా డిప్యుటేషన్‌పై వచ్చి అక్కడే పాతుకుపోవడం తెలంగాణలో మాత్రమే కాదు, ఆంధ్రలో కూడా సర్వసాధా రణంగా జరుగుతున్న తంతు. దీన్ని పట్టించుకుంటే సీరియస్‌గా పట్టించుకోవచ్చు లేదా పట్టించుకోకపోవచ్చు. ‘భారతీయుడు’ మాదిరిగా నిబంధనలను పట్టుకొని వేలాడేవారి సంఖ్య చాలా తక్కువ కనుక డిప్యుటేషన్లను గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి వైద్య ఆరోగ్యశాఖలో బహుకాలంగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నవారి సంఖ్య చాలా అధికంగా ఉందన్న సత్యాన్ని గుర్తించి, తక్ష ణం ఆయా డిప్యుటేషన్లను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఉత్తర్వుల్కెతే జారీ అయ్యాయి కానీ, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ముఖ్యంగా డి.ఎం.హెచ్.ఒ.ల్లోచాలామంది భద్రంగా ఎక్కడివారక్కడే తిష్టవేసి వేసి వుండటంతో, ప్రభుత్వం జారీచేసిన జి.ఓ. లక్ష్యం నెరవేరకుండా పోయింది. మరి ఈ ఉత్తర్వులను ధిక్కరించి వారు ఎట్లా తమస్థానాల్లోనే ఉండిపోగలిగారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లోనినూణం ష్ట్రaశ్రీశ్రీ ఱంంబవ సవజూబ్a్‌ఱశీఅం శీఅ అవవస పaంఱం ష్ట్రవఅషవటశీత్‌ీష్ట్ర, షఱ్‌ష్ట్ర ్‌ష్ట్రవ షతీఱ్‌్‌వఅ aజూజూతీశీఙaశ్రీ శీట ్‌ష్ట్రవ తీవంజూవష్‌ఱఙవ ణఱర్‌తీఱష్ జశీశ్రీశ్రీవష్‌శీతీం/Gశీఙవతీఅఎవఅ్ శీఅశ్రీవ్ణ అనే నాలుగో పాయింట్‌ను ఆధారంగా చేసుకొని, ముఖ్యంగా చాలామంది జిల్లా వైద్యశాఖాధికార్లు తమ జిల్లాలకు చెందిన మంత్రుల నుంచి ‘విల్లింగ్ లెటర్స్’ తెచ్చుకొని తమస్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఇది సరిగ్గా ‘తాళము వేసితిని గొళ్లెమే మరచితిని’ అన్న చందంగా ‘ఉత్తర్వులు జారీచేశాం, పర్యవసానం మరిచాం’ అన్నట్టుగా వున్నది ఉన్నతాధికార్ల వైఖరి! ప్రభుత్వం ఒక ఉత్తర్వును జారీచేసినప్పుడు, అందులో పేర్కొనే అంశాలు కచ్చితంగా తన లక్ష్యం నెరవేరేలా ఉండాలి తప్ప, ‘ఐ తే’, ‘కానీ’, ‘అవసరాన్ని బట్టి’, ‘తప్పనిసరి పరిస్థితుల్లో’ వంటి పాయింట్లతో కూడిన అంశాలను కూడా చేరిస్తే పర్యవసానం ఇట్లాగే వుంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ‘సందిగ్ధాలు’, ‘మినహాయింపులు’ ఉండటం వల్లనే ఆక్రమాలకు దారి ఏర్పడుతోంది. నిజం చెప్పాలంటే ఈ ఉత్తర్వులు జారీచేసేది కూడా ‘ఉన్నత’ స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే కదా!
ఒకప్పుడు ఈ విల్లింగ్ లెటర్ల ప్రహసనం పోలీసుశాఖలో విపరీతంగా ఉండేది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఈ విల్లింగ్‌లకు చాలావరకు అడ్డుకట్ట వేసింది. గత కె.సి.ఆర్. ప్ర భుత్వం ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో ‘సుప్రీం’లుగా భావించడంతో, వారు తమ ఇష్టానుసారంతమకు అనుకూలమైన పోలీసు అధికార్లను నియమించుకొని యదేచ్ఛగా అధికారం చెలాయిం చారు. అటువంటి ఎమ్మెల్యేల కారణంగానే కె.సి.ఆర్. ప్రభుత్వం అప్రతిష్ట మూటకట్టుకొని, చేసిన మంచిపనులు తెరమరుగై అధికారాన్ని కల్పోవాల్సి వచ్చిందనేది నిష్టుర సత్యం. బహుశా దీన్ని గుర్తించే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ విల్లింగ్ లెటర్ల విషయంలో కఠినవైఖరిని అవలంబిస్తున్నదని భా వించాలి.
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (హెచ్.ఎంÊ ఎఫ్.డబ్ల్యు) ఫిబ్రవరి 7నజారీ చేసిన ఉత్తర్వుల పుణ్యమాని, ఇప్పుడు ఈ విల్లింగ్ లెటర్ల గోల వైద్యఆరోగ్యశాఖకు పాకింది. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో చాలాకాలంగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న జిల్లా వైద్యశాఖాధికార్లు ఇప్పటికే తాము పనిచేస్తున్న కేంద్రానికి సమీపంలో ఆసుపత్రులను ఏర్పాటు చేసుకోవడమో లేక ప్రైవేటు ఆసుపత్రులకు అనుగుణంగా పనిచేస్తుండటమో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో డిప్యుటేషన్లు రద్దయితే తాము గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి వె ళ్లాలి. అప్పుడు తాము నడుపుతున్న ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ దెబ్బతింటుంది కనుక, అ క్కడే ఏదోవిధంగా కొనసాగాలనుకుంటున్న వైద్యాధికార్లకు ఉత్తర్వుల్లోని పైన పేర్కొన్న 4వ నిబంధన వరంగా మారింది. దీని ఆధారంగా వారు తమ ప్రాంతానికి చెందిన మంత్రులను కలుసుకొని ‘విల్లింగ్ లెటర్లు’ తెచ్చుకొని, కలెక్టర్లకు సమర్పించి యథాతథంగా కొనసాగుతున్నారు. ఈ ప్రహసనంలో లక్షల్లో చేతులు మారుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఆయా వైద్యాధికార్లు తాము కో ల్పోయే ఆదాయాన్ని బట్టి ఈ ముడుపులు సమర్పించుకొని, ‘మమ’ అనిపించుకుంటున్నట్టు స మాచారం.
ప్రభుత్వంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మంత్రులు లేదా ఎమ్మెల్యేలు ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఒకటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నిండా నాలుగు నెలలు కూడా పూర్తికాలేదు.
తమ అక్రమార్జనా పాటవాన్ని ప్రదర్శిస్తే, ప్రజల్లో ప్రభుత్వం విలువ కోల్పోతుంది. ఇప్పటికే విద్యుత్ కోతలు, సాగునీరు, తాగునీరు విషయంలో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్నది. లసుగులు ఎన్నున్నా, కె.సి.ఆర్. ప్రభుత్వం విద్యుత్, నీరు, రైతుల సమస్యలపై రాజీపడలేదు. దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించుకోవాలి.
వైద్య ఆరోగ్యశాఖ అత్యంత కీలకమైందిగా ప్రభుత్వం పరిగణిస్తుంది.
ఎందుకంటే నిరుపేదలతో సహా ప్రజలందరికి 24గంటల వైద్యసదుపాయం అందుబాటులో ఉండాలి. ఈ కారణంచేతనే వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే డాక్టర్లను రెండేళ్లకు మించి ఒకేచోట పనిచేయడానికి సాధారణంగా పభుత్వం అనుమతించదు. అటువంటిది డిప్యుటేషన్‌పై వచ్చిన వైద్యాధికార్లు ఏళ్లకు ఏళ్లు తిష్టవేసుకొని ఒకేచోట పనిచేస్తుంటే ఇప్పటివరకు పట్టించుకోకపోవడమే విచిత్రం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీన్ని పట్టించుకొని సరిచేయాలనుకుంటే, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే జారీచేసిన ఉత్తర్వు లు బూమరాంగ్ అయినట్టే భావించాల్సి వస్తున్నది.
ప్రస్తుతం ఒకచోటే పనిచేస్తున్న వైద్యాధికార్లలో చాలామంది ‘ప్రైవేటు’ సంపాదన మరగడంతో అక్కడినుంచి బయటకు వెళ్లడానికి ఇష్టపడటంలేదు.
వీరు యదేచ్ఛగా ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించే రీతిలో పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజల్లో ఎం తమాత్రం మంచిపేరు లేని కొందరు వైద్యాధికార్లు తమ అక్రమాలను యదేచ్ఛగా కొనసాగించు కోవడానికి మంత్రులను ఆశ్రయించి పనికానిచ్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సదరు మంత్రులపై కూడా ప్రజల్లో క్రమంగా ప్రతికూలత వ్యక్తమవుతోంది. అందువల్ల మంత్రులు కూ డా తమ వైఖరిని విడిచిపెట్టి, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పనిచేయాల్సిన అవసరం ఉంది. ‘అవినీతి’ అనే అనారోగ్యంతో ఇప్పుడు రాష్ట్రంలోని ‘వైద్య ఆరోగ్యశాఖ’ ఇబ్బంది పడుతోంది. ఖమ్మం జిల్లాలో కూడా కేవలం ఒక్క వైద్యాధికారి కారణంగా ఆ జిల్లాకు చెందిన మంత్రులు ఇప్పుడు బ దనాం అవుతున్నారు. అధికారం ఉన్నది కదా అని ఇష్టంవచ్చినట్టు వ్యవహరిస్తే, భవిష్యత్తులో ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా తగిన గణపాఠం నేర్పక మానరు. తమకు ఏమీ కాదన్న ధీమాతోవ్యవహరించిన కె.సి.ఆర్. ప్రభుత్వం పతనమైన తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ఎవరైనా అనారోగ్యం పాల్కెనప్పుడు, ప్రాణం కాపాడుకోవడానికి ఎంత్కెనా ఖర్చుపెట్టడానికి వెనుకాడరు.
ఆరోగ్యశాఖలో అవినీతి రాజ్యమేలడానికి ఇదొక్కటే ప్రధానకారణం. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యాన్ని అడ్డంపెట్టుకొని అవినీతికి పాల్పడటం అన్కెతికం మాత్రమే కాదు అత్యంత ప్రమాదకరం. వైద్యశాఖ ఉన్నది వైద్యాన్ని అందించడానికి తప్ప దండుకోవడానికి కాదన్న సత్యాన్ని గుర్తించాలి. నీతులు మాట్లాడే అవినీతిపరులు సమర్థించుకోవడానికి అనేక మాటలు చెప్పవచ్చుగాక! ప్రజావైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న జిల్లా వైద్యాధికార్ల వైఖరికి మాత్రం ప్రభుత్వం కచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిందే. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఇది సాధ్యం!