శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని 306 బూతులో భూత్ అధ్యక్షుడు బాసని నవీన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మండల కో ఆర్డినేటర్ నరహ రిశెట్టి రామకృష్ణ హాజరై ఇంటింటి ప్రచార నిర్వహిం చారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 5 నెలలు గడుస్తున్నా చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదు మహాలక్ష్మి స్కీమ్ , రైతుబంధు,భూమిలేని రైతులకు రైతుబంధు, రెండువేల పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తామని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇలాంటి ఎన్నో మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవే మాటలు దేశ మొత్తం చెప్పి అధికారంలోకి రావాలని చూస్తుంది కానీ దేశ ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మకుండా దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలంటే ఈ దేశానికి మోడీ నాయకత్వం చాలా అవసరం ఉన్నదని మూడోసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉంటే ఎన్నో సంస్కరణలకు ఆయన స్వీకారం చుట్టే అవకాశాలు ఉంటాయని ఈ దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తారు కనుక మే 13న జరగబోవు లోక్ సభ ఎన్నికలలో బిజెపి తరఫున పోటీ చేస్తున్న ఆరూరు రమేష్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలి. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కానుగుల నాగరాజు సీనియర్ నాయకులు బాసని విద్యాసాగర్, బూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, బాసాని నవీన్, కోమటి రాజశేఖర్, మేకల సుమన్ తదితరులు పాల్గొన్నారు.