“Call for Grand Arrangements for Mahashivaratri and Peaceful Ramzan”
మహాశివరాత్రి జాతరకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
◆-: ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
మహాశివరాత్రి జాతర కోసం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ అన్నారు. ఈ నెల 15, 16, 17వ తేదీల్లో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై
ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ మాట్లాడుతూ ఉత్సవాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పకడ్బందీగా. మహాశివరాత్రి జాతరను పండుగగా భావించి భక్తులు సులభంగా, వేగంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. శివ స్వాములకు సులభ దర్శనం జరిగే విధంగా చూడాలని, దర్శన సమయం కూడా అరగంట అదనంగా పెంచాలన్నారు. పుర ప్రముఖులకు గతంలో మాదిరి అందజేసి సులభ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలాని. ప్రస్తుతం భక్తుల కోసం రెండు క్యూలైన్ల సిస్టం ఉన్న దృష్ట్యా వీఐపీల కోసం మూడో క్యూలైన్ శివరాత్రి లోగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ ప్రాంగణం వద్ద భక్తులకు తాగునీరు, కుర్చీలు, పందిల్ల సౌకర్యం కల్పించాలని. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. బస్టాండ్ లో మూత్రశాలలు, తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని. కంట్రోల్ రూమ్ల వద్ద ప్రజా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి మైకు ద్వారా భక్తులకు తెలియజేసే సౌకర్యం కల్పించాలన్నారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు శాశ్వత సీసీ కెమెరాలను పెట్టాలన్నారు. జాతర విజయవంతం చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలన్నారు. జాతరలో ఆధ్యాత్మికత, భక్తిభావం ఉట్టిపడేలా భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.
మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన ఏర్పాట్లు చేయాలని. భక్తులు స్వామి వారి దర్శనాన్ని వేగంగా, సౌకర్యంగా చేసుకునేలా ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని కోరారు.
మహా శివరాత్రి జాతర సందర్భంగా యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి జాతర సందర్బంగా ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వలంటీర్లను ఏర్పాటు చేయాలని.
అగ్ని మాపక అధికారులు ఆలయ సిబ్బందికి అగ్ని మాపక పరికరాలు వాడే విధానంపై ముందస్తు అవగాహన కల్పించాలని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్య కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు రోజులు తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని నీటి సరఫరా. అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా
నిరంతరం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని.మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని అన్నారు, అమృత గుండం దగ్గర కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ నుంచి దర్శనానికి వచ్చిన భక్తులను స్నానాలు చేసి బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలన్నారు,
ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు
ఏర్పాట్లు చేయాలని ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఝరాసంగం మండల ఆయా గ్రామీణ ప్రాంతాలు, సైతం అవసరమైన ఏర్పాట్ల కోసం మసీదుల వద్ద విద్యుత్ దీపాలు ఎక్కడైనా, అప్రోచ్ రోడ్డు గుంతల మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని అన్నారు. మసీదుల వద్ద హైమాస్ లైట్, వీధి దీపాల పని తీరు పర్యవేక్షించాలని, మసీదుల వద్ద పారిశుద్ధ్య మురికి కాలువలు నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. మండల అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని పంచాయతి అధికారులను కోరారు. సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర వ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యుత్తు అధికారులకు సూచించారు. ఏదేని విద్యుత్తు సమస్య వచ్చినా తక్షణమే స్పందించేందుకు మసీదు పెద్దలకు ఆ ప్రాంతం యొక్క లైన్ మెన్ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలని అన్నారు,ఇషా నమాజ్ తర్వాత రాత్రి సమయంలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు.సహర్ (Sehri): సూర్యోదయానికి ముందు వేకువజామున చేసే భోజనం. ఈ సమయంలో విద్యుత్ శాఖ అధికారులకు రంజాన్ సమయాలను తెలియజేసి, ఆ సమయంలో పవర్ కట్స్ చేయకుండా చూడాలని ముందస్తుగా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మండల ఆయా గ్రామాలలో వంటి ప్రాంతాలలో ఇబ్బందులను నివారించాలని కోరారు.
