ప్రయాగ్రాజ్ అయోధ్యను దర్శించుకున్న తాజా మాజీ సర్పంచ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల్ మల్గి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి తమ పార్టీ బిఆర్ఎస్ నాయకులు – సభ్యులతో మరియు గ్రామ మిత్రులు కలిసి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళను సందర్శించిపుణ్య స్నానాల ఆచరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభమేళా జరుగుతుందన్నారు. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందాని దీన్ని ఆదిశంకరాచార్యు లు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్స రసలు, జంతువులు, విషయం, అమృతం వంటివి బయటికొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణా ల్లో ఉన్నాయన్నారు. కోట్లాది సత్పురు షుల మధ్య స్నానం ఆచరించడం తన జీవితం ధన్యమైందని అన్నారు. అంతే కాకుండా వారణాసి అయోధ్య ఉజ్జయిని మహంకాళేశ్వరం ఓంకారేశ్వర్ ను వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు మాణిక్ యువ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.