టిఆర్ఎస్ పార్టీకి మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు రాజీనామా..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం లోని రుద్రారం గ్రామానికి చెందిన
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు
సి. మధుసూదన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనందుకు ఆయన మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినా కూడా ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరడం లేదని, తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!