వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను పెండిం గు లో ఉంచకుండా వెంటనే చేపట్టాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు .వనపర్తి లో పాలిటెక్నిక్ కళాశాల నుండి రామాలయం వరకు రోడ్ల విస్తరణ పెండిం గు లో ఉన్నదని వెంటనే చేపట్టాలని రోడ్ల విస్తరణలో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు . చిట్యాల లో డబుల్ బెడ్ రూమ్ ల దగ్గర కనీస సౌకర్యాలు కల్పించాలని పెబ్బేర్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు గతంలో ఎస్ డి ఎఫ్ నిధులు 15 కోట్లు మంజూరు అయినాయని అందులో 5 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మిగతా నిధులు అభివృద్ధి పనుల కోసం వినియోగించాలని కలెక్టర్ ను కోరారు . మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ గట్టు యాదవ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ లక్ష్మారెడ్డి మీడియా ఇంచార్జ్ నందిమల్ల అశోక్ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఎంపీపీలు జెడ్పిటిసిలు శ్రీధర్ రెడ్డి సేవా పతి పద్మా వెంకటేష్ ఉన్నారు