మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర

త్వరలో ముహూర్తం ఖరారు ? -సంగమేశ్వర బసవేశ్వర ఎత్తి పోతల పూర్తి చేయాలని సంకల్పంతో యాత్ర

-ప్రాజెక్టు తో మూడు నియోజక వర్గాలకు ఒక్కొనియోజజవర్గనికి లక్ష ఎకరాల ఆయకట్టు కింద సాగు నీరు అందించలనే ఆకాంక్ష

-జిల్లాలో ఉన్న మంజీర నది ఉన్న రైతుకూ వర్షాధారం దిక్కు -ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వరం రోజుల పాటు పాదయాత్ర

-130 కి.మీ, పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో రోజుకో సభ. -చివరి రోజు సభకు కేసీఆర్ హాజరు?

జహీరాబాద్. నేటి ధాత్రి:

నారాయణ ఖెడ్, అందోల్, నియోజకవర్గాలకు సాగు నీరు కోసం,చేపట్టిన సంగమేశ్వర బసవేశ్వర ఎత్తి పోతల పథకం ప్రజాక్ట్ పనులను ప్రారంభించుటకు శంకుస్థావన పనులను అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో 2022 లో ఫిబ్రవరి 21 న నారాయణఖేడ్ లో అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ శంకు స్థాపన చేశారు, ఆర్థిక మంత్రి గా ఉన్న హరీష్ రావు, నేతృత్వంలో ఆయా ఎమ్మెల్యే లు మాణిక్ రావు, భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, చింత ప్రభాకర్ ల నేతృత్వం లో పైలాన్ ఆవిష్కరించి ప్రసంగించారు, కానీ ఆ తర్వాత అదే ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ను అందోళ్ నియోజక వర్గంలోనీ మునిపల్లి మండలం చిన్న చెల్మెడ గ్రామ శివారులో హరీష్ రావు శంకు స్థాపన చేశారు.. అందోల్ జహీరాబాద్ నియోజక వర్గ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్,సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ ఛైర్మెన్ ఎం శివకుమార్, తో కలిసి బూమి పూజ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆయా
నియోజకవర్గాల నాయకులు రైతులు పాల్గొన్నారు. టెండర్ పనులను కూడా ఖరారు చేసారు, కానీ హనుయంగా 2023 సం రంలో రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ అధికారం చేపట్టింది, అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జిల్లా మంత్రి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తి పోతాల పనులను మరుగున పడేశారు, అని ఇటీవల జహీరాబాద్ నియోజక వర్గం జరాసంగం మండలం లోని మేధపల్లి గ్రామ మాజీ సర్పంచ్ యువ నాయకులు పరమేశ్వర్ పాటిల్, అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ విఫలం అయింది అని ఉమ్మడి రాష్ట్రం లో ఉన్న రాష్ట్ర రైతుల పరిస్థితి ఇప్పుడు కూడా ఉన్నది అని సాగు నీరు లేక వర్షాధార పంటలు సాగుచేసి ఆకాశానికి వర్షపు బొట్టు కోసం ఎదురు చూస్తున్నారు ఎత్తిపోతల పథకం పనులుపూర్తి చేయాలని పూర్తి కావాలి అంటే అది కేసీఆర్ కే సాధ్యం అని ఎవరివల్ల కాదు, అని ఆ రెండు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, దానికోసం రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సాధ్యం అని, ఝరాసంగం మండల కేంద్రం లోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రగా ఐదు రోజులు పాదయాత్ర చేసి గజ్వేల్ మీదుగా ఎర్రవల్లి వరకు 140 కి మీ, పాదయాత్ర చేసి ఆ ఉక్కు గుండెల వాడు, భక్కపలచని కేసీఆర్ ను కలుస్తా, రైతుల సమస్య లను వివరిస్త అని పాదయాత్ర పూర్తి చేసి కేసీఆర్ కు అత్తుకొని బోగోద్వేగానికి గురై పాదాభివందనం చేశారు, దీనికి చలించిన ముఖ్యమంత్రి 31 జనవరి 2025 రోజు జహీరాబాద్ నియోజక వర్గం నుండి పాదయాత్రగా వచ్చిన పరమేశ్వర్ పాటిలు మద్దతుగా వచ్చిన నియోజక వర్గ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ ఛైర్మెన్ ఎం శివకుమార్, సంఘీభావంగా మాజీ మంత్రి హరీష్ రావు, చింత ప్రభాకర్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. దీంతో పాదయాత్ర గా బయలు దేరిన పరమేశ్వర్ పాటిల్ గూర్చి మాట్లాడుతూ, రైతుల పక్షాన దేనికైనా సిద్ధం నీ పాదయాత్ర వృద్ధిపోదు, నీలాంటి యువకులు ముందుకు రావాలి. ఆ రోజు ఉద్యమం మొదలు పెట్టినరోజు ఒక్కడినే కానీ యువకులు, విద్యార్థులు,, అన్ని సంఘాల వారు ముందుకు వచ్చి నాకు మద్దతుగా నిలిచిన రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఉవ్వెత్తున ఎగసి రాష్ట్రం సాధ్యం అయింది, అని అన్నారు. చాలా రోజులకు మొట్టమొదటి సరిగా జహీరాబాద్ ప్రాంతం వారితో కలిసి, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి బావోగ్వేధంగా ప్రసంగించారు.. అప్పుడు అక్కడే పక్కన ఉన్న హరీష్ రావుకి మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం కోసం మరో ఉద్యమం మొదలు పెట్టు దానికోసం నారాయణ ఖేడ్, జహీరాబాద్ , అందోల్ నాయకులతో కలిసి ప్రతేక సాగునీటి ఉద్యమం మొదలు పెట్టు అని పేర్కొన్నారు.
దానికోసం మాజీ మంత్రి హరీష్, ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేల జహీరాబాద్ ఎమ్మెల్యే తో మాట్లాడి ప్రతేక పోరాటానికి సిద్ధం అయి పాదయాత్రకు సిద్ధ పడ్డారు, దీనికోసం ప్రత్యేకంగా పాదయాత్ర చేయడానికి ఒక వారం రోజుల పాటు పడుతుంది అని, రోజు 18, నుండి 20 కి,మి, పాదయాత్ర కొనసాగుతుంది అని వారం రోజులు పాదయాత్ర చేస్తే 130, నుండి 140 కి. మీ
పాదయాత్ర కొనసాగవచ్చు అని తెలుస్తుంది, సంగారెడ్డి, జహీరాబాద్ అందోల్ నారాయణ ఖేడ్, నాల్గు నియోజక వర్గాలకు నాల్గు లక్షల ఎకరాలు సాగునీరు అందేలా చూడాలి అని దానికోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ల మరో సాగునీటి ఉద్యమం మొదలు పెట్టి రైతులకు సాగునీరు అందించడమే కేసీఆర్ లక్షం అని దానికోసం ఆయన అడుగుజాడల్లో దేనికైనా సిద్ధం అని అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో ఉంటే త్వరలో పాదయాత్ర మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది, ఈ రెండు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి అయితే 397 గ్రామాలకు సాగునీరు వచ్చి నాల్గు లక్షల ఎకరాలు ఆయకట్టు పూర్తి అవుతుంది అని బి ఆర్ ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం నుండి ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది, ఇక్కడి నుండి పాదయాత్ర మొదలు పెట్టి నారాయణ ఖేడ్, పట్టణం లోని బసవేశ్వర మందిరం వరకు కొనసాగి పాదయాత్ర పూర్తి అవుతుంది, పాదయాత్ర లో నాల్గు నియోజక గ్రామాలు ఉండేలా రూట్ మ్యాప్ తయారు చేసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాదయాత్ర లో భాగంగా రోజుకొక గ్రామంలో ప్రతేక సభలు ఉండేలా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు.. పాదయాత్ర ముగింపు రోజు కేసీఆర్ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!