ముందు చూపుతో కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
నేటిదాత్రి కమలాపూర్ (హన్మకొండ)హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ పాఠశాల లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు తో కలిసి మొక్కలను నాటారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. హరితహార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం చాలా సంతోషకరమైనదని అన్నారు.గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో హరితహారం కార్యక్రమం చేపట్టడం ద్వారా ఎంతో మేలు జరిగిందని గత ప్రభుత్వం హరితహారం కోసం చాలా నిధులు కేటాయించడం జరిగింది.చెట్లను పెంచడం ద్వారా పల్లెల్లో పచ్చదనంతో ఎంతో ఉల్లాసంగా ఉంటుందని, చెట్లు నాటడంతో మనిషి జీవనానికి ఎంతో ఉపయోగపడతాయి. చెట్ల ద్వారా వచ్చే గాలి స్వచ్ఛమైనది ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. ప్రతి ఒక్కరు చెట్లు నాటాలన్నారు..వన మహోత్సవం లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని విద్యార్థులకు,అధ్యాపకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .