
చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ శ్రీను
చేర్యాల నేటిదాత్రి
చేర్యాలలో స్థానిక పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ శ్రీను మాట్లాడుతూ ఎవరైనా ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో పరిసరాల ప్రజలకు చెప్పి వెళ్లాలని అన్నారు తమ తమ బంగారు వెండి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని బీరువాలో పెట్టడం ఎంతవరకు క్షేమకరం కాదని అన్నారు ఇటీవల జరిగిన దొంగతనాలు ఒకే విధంగా ఉండడాన్ని మేము గమనించామని వారిని తొందరలోనే పట్టుకుంటామని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పరిసరాలలో సీసీ కెమెరాలు బిగించుకొని ఉండాలని దానివలన తమ భద్రతతో పాటు సమాజానికి మేలు చేసిన వారు అవుతారని అన్నారు మరియు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కార్మికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో చేర్యాల ఎస్సై దామోదర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు