పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి
తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి:
అందరూ భక్తి భావం పెంపొందించుకోవాలని,ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. గురువారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని 16వ వార్డులో బాల వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు స్థానిక కౌన్సిలర్ బిజ్జాల మాధవి అనిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…వినాయకునికి పూజలు చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని…. వినాయక చవితి పండగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో,ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. ప్రజలందరూ గణేష్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.జ్ఞానం,శ్రేయస్సు, అదృష్టానికి స్వరూపుడుగా వినాయకుడిని కొలుస్తామని తెలిపారు.ఆయన ఆశీస్సులతో ఎలాంటి అడ్డంకులు లేకుండా వ్యక్తిగత,సామూహిక లక్ష్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. నూతన విశ్వాసం,సంకల్పంతో సరికొత్త ప్రారంభాలు నియోజకవర్గ సమగ్రాభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.ప్రతి శుభకార్యం మొదలు పెట్టేటపుడు ప్రథమ పూజలు అందుకునే వినాయకుడినే పూజిస్తామన్నారు.గణపతి నవరాత్రి ఉత్సవాలను అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.600 మందికి అన్నదాన వితరణ చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, స్థానిక కౌన్సిలర్ bijjala మాధవి అనిల్ కౌ న్సిలర్ పేర్ల యమునా జంపన్న,నాయకులు గంజి ప్రసాద్ రెడ్డి,కందాడి అచ్చిరెడ్డి,ధరావత్ సోమన్న, దొంగరి శంకర్, టి విక్రాంతు, సరిత స్థానిక వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.