నేటిదాత్రి హసన్ పర్తి:
సిపిజిఇటి మొదటి దశ కౌన్సెలింగ్ ముగియడంతో విద్యార్థులు వివిధ యూనివర్సిటీలలో రిపోర్టింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్మీషన్ ల కోసం నూతనంగా వచ్చే విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి కాకతీయ యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుండి కాకతీయ యూనివర్సిటీలో అడ్మీషన్ పొందిన విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్దకి వచ్చి వారి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ ఏఐఎస్ఎఫ్ నాయకులు అడ్మీషన్ కోసం పాటించవలసిన ప్రక్రియ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎక్కడ ఎలా చేసుకోవాలి, వివిధ డిపార్ట్మెంట్ ల గురించి సమాచారం, హాస్టల్ వసతి తదితర అంశాలపై నూతన విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి ప్రణీత్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి రవితేజ తదితరులు పాల్గొన్నారు.