ప్రతి విద్యార్థి కష్టంగా కాకుండా ఇష్టంగా చదివాలి

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ

బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు నిరంతరం కష్టపడాలి

మొదటి స్థానంలో నిలిచే విధంగా విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలి

జనగామ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటాలి

జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున

జనగామ, నేటిధాత్రి:-
ప్రతి విద్యార్థి కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసుకోవాలని జనగామ మునిసిపల్ చైర్పర్సన్ పోకలజమున అన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో మనసున్న మహారాజు విద్యా సంస్థల అధినేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వితరణ చేసిన పరీక్షా సామాగ్రిని జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున బి ఆర్ ఎస్ నాయకులు పళ్ళ రాజేశ్వరరెడ్డి గారి ఆదేశానుసా రం పలు పాఠశాలలలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి తల్లి తండ్రి తమ తమ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ప్రోత్సహించాలని అన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ప్రతిక్షణం వారిపై ఓ కన్నేసి ఉంచాలని అన్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులను టీవీలకు ఫోన్లకు సినిమాలకు విందులకు వినోదాలకు దూరంగా ఉంచాలని సూచించారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వితరణ చేసిన పరీక్షా సామాగ్రిని జనగామ ఏబీవీ హై స్కూల్, జనగామ ప్రిస్టన్ ఇనిస్ట్యూట్ పాఠశాల, జడ్పీహెచ్ఎస్ (బి )జనగామ, ప్రభుత్వ పాఠశాల జనగామ, జెడ్ పి ఎస్ ఎస్ (జి) జనగామ, పాఠశాలలలోని 179 మంది విద్యార్థులకు పెన్నులు, జామెంట్రీ బాక్స్ లు, పెన్సిల్స్ ఎగ్జామ్ ప్యాడ్స్, హాల్ టికెట్ కవర్స్, పరీక్ష సామాగ్రిని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రేమలతారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి రాజేందర్
బిఆర్ఎస్ నాయకులు ,దిశా కమిటీ మెంబర్ రావెల రవి, అనిత,నీల రమ్మనోహర్, నాగరాజ్ తిప్పారపు విజయ్, చిరంజీవి ,శివ ,మీడియా ఇంచార్జి రాజు తదితరులు పాల్గొన్నారు.

జనగామ కు పల్లా ఎమ్మెల్యే కావడం ఒక వరం

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ కు రావడం ఒక వరమని బీఆర్ఎస్ నాయకుడు నీల రామ్ మనోహర్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేకుండా ఎమ్మెల్యేగా గెలిచి వాగ్దానాలు చేసిన ప్రతి పనిని తూచా తప్పకుండా పూర్తిచేసే దమ్మున్న నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అని , జనగామ నియోజకవర్గం పేరు చెప్తే చాలు హైదరాబాద్ నీలిమ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తూ పేద ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప మనసున్న మహారాజని అన్నారు. వైద్యమే కాకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పరీక్షా సామాగ్రిని అందించి , నిరు పేద విద్యార్థుల రేపటి భవిష్యత్తు కోసం తమ విద్యాసంస్థల్లో ఉచిత విద్యను , విద్యల్లో ప్రతిభ కనబరిచిన వారికి తమ విద్య సంస్థల్లో రాయితీ అందించేందుకు సిద్ధంగా ఉన్నాడని జనగామ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి ఎమ్మెల్యేను ఏనాడు చూడలేదని ఇక చూడబోమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *