అయోమయంలో మండల కాంగ్రెస్, దిక్కు తోచని స్థితిలో మండల క్యాడర్
వెంకటాపూర్, నేటిధాత్రి:
మండలంలోని అనేక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి వలసల పర్వం నడుస్తోంది. మంగళవారం రోజు ఎల్లారెడ్డిపల్లె గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ చింతిరెడ్డి శ్రీరంజని ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి 30 మంది ముఖ్య నాయకులు భారాస పార్టీ మండల ఎన్నికల ఇంచార్జ్ సాంబారి సమ్మారావు, మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి మరియు జెడ్పిటిసి గై రుద్రమదేవి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. సాంబారి సమ్మారావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మండల అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ వెంకటాపూర్ మండలం భారాస పార్టీకి వన్ సైడ్ గా మారిందని, ఇదే రెట్టింపు ఉత్సాహాన్ని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లాలని కెసిఆర్ గారి 2023 మేనిఫెస్టోకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, అభివృద్ధి చేస్తున్న భారాస పార్టీని ప్రజలు అదరిస్తారని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కాపాడుకుంటుందని అని అన్నారు. సమ్మారావు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ గారు ఒక ప్రణాళికతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని, చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజలకు చేరవేస్తున్నారు అలాంటిది నేడు రాష్ట్రంలో దొంగల హడావుడి ఎక్కువైంది వారికి ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, అరవై సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నికలు రాగానే 6 గ్యారంటీలు అని మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మళ్లీ మోసం చేయాలని వస్తున్నారని, 10 ఏళ్ల ముందు మన జీవన విధానం, నేడు మన జీవన విధానం ఎలా ఉందో అని ప్రజలు ఆలోచించాలని, 60 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులు పదేళ్లలో కేసీఆర్ చేసి చూపెట్టారని, మీకు ఎల్లవేళలా అండగా ఉండే భారాస పార్టీని ఆదరించాలని మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని, ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించి కెసిఆర్ కి కానుకగా అసెంబ్లీకి పంపాలన్నారు.
ఎల్లారెడ్డిపల్లి నుండి పార్టీలో చేరిన వారిలో వార్డ్ మెంబర్ ల్యాగల స్వప్న తిరుపతి, సీనియర్ నాయకులు వీరబోయిన సాంబయ్య, పులి కోటయ్య, లెంకలపెల్లి రాజ్ కుమార్, బోయిన రమణయ్య, మేరుగు దేవేందర్, ప్రశాంత్, కిరణ్, బండారి ప్రణయ్ భాస్కర్, బైకని పెద్ద రాజయ్య, కోటయ్య, వైనాల కిరణ్, పులి చంటి, దూడపాక నరేష్ వీరితోపాటు మరో 15 మంది భారాస తీర్థం పుచ్చుకున్నారు. వారు మాట్లాడుతూ జ్యోతక్క గెలుపు కోసం పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ సర్పంచ్ మేడబోయిన అశోక్, స్థానిక ఎంపిటిసి పోశాల అనిత వీరమల్లు గౌడ్, స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షులు రవి, పాలంపేట పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు భాషవేణి పోశాలు, భాషవేణి జ్ఞానేందర్, కోఆప్షన్ సభ్యులు జహీర్ పాషా, ఆత్మ డైరెక్టర్ చీకుర్తి మధు, పార్టీ నాయకులు గాజుల శ్రీనివాస్, బోయిని సదయ్య, వీరగాని సాంబయ్య, చిర్ర వీరస్వామి, గ్రామ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.