ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలకు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలను ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. పంచాయతీ రాజ్ యాక్ట్ 285ఏ సెక్షన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50శాతం లోబడే ఉండాలని చెపుతుందని తెలిపింది. ఎలక్షన్ కమిషన్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, ఎన్నికల సంఘానికి, తెలంగాణ బిసి కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.