ఎన్నికల అబ్జర్వర్ తనిఖీ
సాధారణ ఎన్నికల వ్యయపరిశీలకులు శ్రీనివాస్ మండలకేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల నిర్వహణ పట్ల మండల ఎన్నికల అధికారులు నిర్వహిస్తున్న పనుల పట్ల రికార్డులను తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, పోస్టల్ బ్యాలెట్లు, ఓటింగ్ విధానంపై ఎన్నికల అధికారిని గుంటి పల్లవిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలు, జరిగే విధానం, రికార్డుల పట్ల ఆయన సంతప్తి వ్యక్తపరిచారు. అలాగే పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలన చేసి అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఇఓపిఆర్‌డి ఖాజామైనోద్దిన్‌లు ఉన్నారు.