వనపర్తి నేటిదాత్రి :
బుధవారం సాయంత్రం కలెక్టర్ తేజస్ నం ద లాల్ పవర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కె రక్షిత కృష్ణమూర్తి తో కలిసి ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తరుణంలో జిల్లాలో ఎక్కడ చట్టవిరుద్ధమైన చీప్ లిక్కర్, మాదక ద్రవ్యాలు, అనుమతులు లేని వాహనాలు, అక్రమంగా డబ్బులు రవాణా వంటివి జరగడానికి వీలు లేదని అన్నారు. నిర్లక్ష్యానికి ఏ మాత్రం తావులేకుండా జిల్లా లో జరుగుచున్న రవాణా పై ప్రత్యేక డేగ కన్ను పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీస్, ఎక్సైజ్, రవాణా, కమర్షియల్ టాక్స్ సిబ్బంది సమన్వయం తో పనిచేస్తూ మూకుమ్మడిగా సోదాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి రోజు ఏ చెక్ పోస్టు లో ఎవరు పనిచేస్తున్నారు, ఎన్ని సీజ్ చేశారు, సీజ్ చేసిన వివరాలు ఎప్పటికప్పుడు తనకు, కంట్రోల్ రూం కు పంపించాలని ఆదేశించారు. వీధులలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. తనిఖీల్లో చాకచక్యం తో పాటు పారదర్శకత ఉండాలని సూచించారు.
జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో 6 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇకనుండి రవాణా, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు సైతం చెక్ పోస్ట్ వద్ద ఉండి సమన్వయంతో పనిచేసే విధంగా చూసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్ తిరుపతి రావు, ఆర్డీవో పద్మావతి,. భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభుకుమార్, జిల్లా రవాణా అధికారి రామేశ్వర్ రెడ్డి, కమర్షియల్ టాక్స్ అధికారి, ఇంకంటాక్స్ అధికారి, సీజర్ కమిటీ కన్వీనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు పకడ్బందీగా చేపట్టా లి
