కవేలిలో ఉపాధి హామీ పనుల జాతర
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల జాతరను పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సురేఖ గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం, పంట కాలువల తవ్వకాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మొక్కల పెంపకం వంటి పనుల వివరాలను తెలియజేశారు. చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వల్ల పారదర్శకత పెరిగిందని గ్రామ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.