
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ కార్డు ఫ్రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం, తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకొనే విధానం గురించి దాని ఉపయోగాలు గురించి మహబూబ్ నగర్ జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి హజారుద్దీన్ విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పియా చిన్నమ్మ మాట్లాడుతూ ఎంప్లాయిమెంట్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని తెలిపారు. టి. ఎస్. కే.సి. కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ . రమాదేవి, టీ.ఎస్. కే. సి మార్గదర్శకులు ప్రతాప్, ఈ కార్యక్రమం లో విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ కార్డులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జగన్, శ్రావణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు..