# డివిజన్ కార్యదర్శి ఎలకంటి రాజేందర్.
నర్సంపేట,నేటిధాత్రి :
పీడిత ప్రజల విముక్తి సమసమాజ స్థాపన లక్ష్యంగా సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భవించిందని డివిజన్ కార్యదర్శి ఎలకంటి రాజేందర్ అన్నారు. నర్సంపేటలోని న్యూ డెమోక్రసీ కార్యాలయం వద్ద లెనిన్ 154 వ జయంతి, సిపిఐ ఎంఎల్ ఆవిర్భావం పురస్కరించుకొని అరుణ పతాకాన్ని ఎగురవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎలకంటి రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ కమ్యూనిస్టు, సోషలిస్ట్ యోధుడు, ప్రపంచ ప్రజలకు మార్గదర్శిగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడని కొనియాడారు.నేడు ఎర్రజెండా పేరుతో కొనసాగుతున్న సిపిఐ,సిపిఎం రివిజనిస్టు పార్టీలు పాలకవర్గాలతో సీట్ల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. ఆనాడే వీరి విధానాలను తిప్పికొడుతూ తరిమెల నాగిరెడ్డి పార్లమెంటును బాతాకాని క్లబ్ గా విమర్శిస్తూ పార్లమెంటు ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కావని నమ్మి రాజీనామా చేసి సాయుధ పోరాట పందాకు ఊతమిచ్చాడని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గట్టి కృష్ణ, భోగి సారంగపాణి,భీమగాని మల్లయ్య,వేముల వెంకట్ రెడ్డి, కొంపెల్లి సాంబయ్య, ఐలయ్య, పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటస్వామి, పిడిఎస్యు డివిజన్ కార్యదర్శి గుర్రం అజయ్,పిఓడబ్ల్యు డివిజన్ నాయకురాలు సౌందర్య, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.