· పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వ చర్యలు
· రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లకు ప్రోత్సాహం
· 2030 నాటికి 20వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యం
· గ్రిడ్‌పై భారం పడకుండా సౌర, పవన విద్యుత్‌లపై దష్టి
· వ్యవసాయానికి ఇబ్బంది రాకుండా విద్యుత్ సరఫరాకు చర్యలు
· వచ్చే మే నెల నాటికి విద్యుత్ డిమాండ్ తట్టుకునే రీతిలో సబ్స్టేషన్ల ఏర్పాటు
· తగినన్ని పంపిణీ ట్రాన్స్ఫార్మను నెలకొల్పనున్న ప్రభుత్వం
ఈనెల 3న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఏడాది మొట్టమొదటిసారి 18139 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. 2025లో నమోదైన అత్యధిక 17162 మెగావాట్లను ఇది అధిగమించింది. కాగా విద్యుత్ అధికార్లు ముందస్తు అంచ నాలు వేసి వుండటం వల్ల అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయగలిగారు. రాబోయేది ఎండాకాలం కనుక విద్యుత్ డిమాండ్ పెరగడం సహజమే కదా, అన్న సందేహం ఉత్పన్నం కావచ్చు. నిజమే కానీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ఆర్థిక ప్రగతికి ఒక చిహ్నంగా భావించాలి. పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతే, పవర్ కట్లు తప్పవు. అది పారిశ్రామిక ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం ప డుతుంది. ముఖ్యంగా డిమాండ్ పెరుగుదల తయారీరంగంలో విద్యుత్ వినియోగం పెరగడాన్ని సూచి స్తుంది. తయారీరంగం పనితీరు బాగా వుంటే జీడీపీలో దాని ప్రభావం బలీయం గా వుంటుంది. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో గహాల్లో విద్యుత్ వినియోగం పెరగడం పెరిగిన ప్రజల జీవన ప్రమాణానికి సూచిక. ఎందుకంటే ఎసీలు, తదితర గహ విద్యుత్ ఉపకరణాల వాడకం పెరగడాన్ని ఇది తెలియజేస్తుంది. ఇక సేవారంగంలో ఐటీ పార్క్‌లు, మాల్స్ వంటివి బాగా విస్తరించడాన్ని కూడా ఈ పెరిగిన డిమాండ్ వెల్లడిస్తుంది.
డిమాండ్ పెరగడం పైన పేర్కొన్న సానుకూలతలకు చిహ్నమైనప్పటికీ, ఇది గ్రిడ్ సామర్థ్యాన్ని మించినపోయినప్పుడు విద్యుత్ కోతలు విధించక తప్పదు. అంతేకాదు విద్యుత్ సరఫరాకు సంబంధించిన పరికరాలు కూడా దెబ్బతీనే అవకాశాలుంటాయి. ప్రస్తుతం రాష్ట్రం ధర్మల్ విద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడుతుండటం వల్ల వాతావరణంలో కలిసే కర్బన ఉద్గారాల పరి మాణం, డిమాండ్ పెరిగే కొద్దీ మరింత పెరుగుతూ పోతుంది. అందువల్ల విద్యుత్ సరఫరాను పర్యావరణహితంగా మార్చాలంటే పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడక తప్ప దు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై దష్టి సారించినప్పటికీ, ఇంకా ఊపందుకోవాలంటే కొంత కాలం పడుతుంది. కాగా ప్రస్తుతం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫ రా చేయడం ప్రభుత్వం ముందున్న తక్షణ సమస్య. గ్రిడ్ సామర్థ్యాన్ని డిమాండ్ మించిపోయి నప్పుడు రాష్ట్రం నేషనల్ ఎక్స్ఛేంజ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఇప్పటి కే అప్పుల భారంతో కునారిల్లుతున్న రాష్ట్రానికి ఇది పెను భారంగా మారవచ్చు. మొత్తంమీద చెప్పాలంటే పెరుగుతున్న డిమాండ్ సానుకూల పరిణామమే అయినప్పటికీ, ఇది విద్యుత్ పంపిణీ సంస్థలపై మరింత వత్తిడి పెంచుతుంది. వచ్చే ఏప్రిల్, మే మాసాల్లో వుండే అత్యధిక డిమాండ్‌ను తట్టుకునేందుకు ఇప్పటినుంచే సంస్థలు ముందస్తు చర్యలు చేపట్టాల్సివుంటుంది.
పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, తగ్గుతున్న శిలాజ ఇంధన వనరుల నేపథ్యంలో అన్ని రా ష్ట్రాల మాదిరిగానే తెలంగాణ కూడా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైపు దష్టి పెట్టక తప్పదు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలవల్ల, రాష్ట్రం 11399 మె గావాట్ల పునరుత్పాదక ఇంధన వ్యవస్థాపక సామర్థ్యానికి చేరుకుంది. ఇందులో 7889 మెగావాట్లు సౌరవిద్యుత్ కాగా, 2518 మెగావాట్లు జలవిద్యుత్నుంచి లభ్యమవుతోంది. 2023`24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సేకరించిన మొత్తం విద్యుత్‌లో 14% ఈ పునరుత్పాదక ఇంధనమే కావడం విశేషం. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో పగటికాలంలో మిగులు సౌరవిద్యుత్‌ను వ్యవసాయానికి తరలించడం ద్వారా గ్రిడ్‌పై భారం పడకుండా జాగ్రత పడుతోంది. విద్యుత్‌ను నిల్వచేసేందుకు ప్రభుత్వం సజనాత్మకంగా 1680 మెగావాట్ల “పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సిస్టం” (సౌర, పవన విద్యుత్‌లను కూడా కలిపి)ను ఏర్పాటు చేసింది. దీనివల్ల పగటిపూట సౌరవిద్యుత్‌ను నిల్వచేసిన అధిక డిమాండ్ వున్న రాత్రి వేళల్లో దీన్ని వినియోగించడం ద్వారా వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా చూస్తోంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ 24215 మెగావాట్లు వుండగలదని అంచనా.
ప్రభుత్వం 2025లో తీసుకొచ్చిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం 2030 నాటికి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 50శాతం గ్రీన్ విద్యుత్ వుండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం పెద్ద ఎత్తు న బ్యాటరీ స్టోరేజీ సదుపాయం, వికేంద్రీకత సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టాల్సి వుం టుంది. వీటిని మహిళా స్వయం సంఘాలకు అప్పగించాలన్ని ప్రభుత్వ యోచన. ప్రభుత్వ గ్రీన్ ఎనర్జీ పాలసీకి సానుకూలంగా రూ.29వేల కోట్ల మేర ఈరంగంలో పెట్టుబడులు పెట్టడా నికి వివిధ సంస్థలు ముందుకు రావడం విశేషం. వీటిల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, 250 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ వున్నాయి. దీర్ఘకాలిక ప్రణాలికలో భాగంగా 2047 నాటికి 90శాతం విద్యుత్ పునరుత్పాదక, స్టోరేజ్ వ్యవస్థలనుంచి పొందాన్నది లక్ష్యం. ముఖ్యంగా ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధనకు ఇది కూడా ఒక దోహదకారిగా వుండగలదు.
సౌర, పవన విద్యుత్‌పై ఆధారపడాలంటే, వీటి స్టోరేజీ వ్యవస్థలను మరింత వేగంగా అభివద్ధి చేయాలి. దీంతోపాటు గ్రిడ్‌ను కూడా ఆధునికీకరించాలి. గాలి, ఎండ తక్కువగా వున్న సమయంలో విద్యుత్ స్టోరేజీకి ఇది చాలా అవసరం. ప్రైవేటు పరిశ్రమల వినియోగదారులు పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌పై ఆధారపడాలంటే, అనుమతుల ప్రక్రియలో విపరీత జా ప్యం వంటి అడ్డంకులు ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ`2025 కింద ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం కీలకాంశం. ఇది గహ యజ మానులు సొంత ఇంటి విద్యుత్ అవసరాలను తీర్చుకొని మిగులు విద్యుత్‌ను, విద్యుత్ సంస్థ లకే అమ్మే అవకాశం కల్పిస్తుంది. దీనిద్వారా గహ వినియోగదారులకు ఆదాయం కూడా లభిస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని గహ యజమానులు తమ పైకప్పులపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం మరింత సరళం చేసింది. గహ వినియోగదార్లు తమకు అనుమతించిన వందశాతం సామర్థ్యంతో కూడిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. 10 కిలోవాట్ అనుమతి వరకు ఏవిధమైన పరిశీలనలు లేకుండానే అనుమతి లభిస్తుంది. అంతకు మించిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి 15రోజుల్లోగా అ నుమతి లభిస్తుంది.
ఈ ఏడాది వేసవికాలంలో విద్యుత్ డిమాండ్ 19వేల మెగావాట్లను దాటే అవకాశమున్నదని అంచనావేస్తున్నారు. దీన్ని తట్టుకునేందుకు వీలుగా మార్చి నెలాఖరులోగా 26 హై`లోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సబ్`స్టేషన్ల ఏర్పాటుతో పాటు, 1800 పంపిణీ ట్రాన్స్ఫార్మర్లను నెలకొ ల్పనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సుస్థిరాభివద్ధితో పాటు దీర్ఘకాల లక్ష్యాలను సాధించే దిశ గా ముందుకెళుతోంది. శంకరపల్లిలో 500 మెగావాట్ల సామర్థ్యమున్న ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా రాత్రివేళల్లో వుండే అత్యధిక డిమాండ్‌ను తట్టుకు నేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో పరిశ్రమలకు పరిమితితో పనిలేకుం డా క్యాప్టివ్ పవర్ జనరేషన్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులివ్వనున్నారు. దీనివల్ల గ్రిడ్‌పై భారం గణనీయంగా తగ్గనుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్న నేపథ్యంలో పెరిగే గహ వినియోగ డిమాండ్‌ను కూడా ప్రభుత్వం దష్టిలో పెట్టుకుంది. ఈ పథకం కింద ఈ ఏడాది తొలి నాటికి 52.82 లక్షల కుటుంబాలు నమోదయ్యాయి. 200 కంటే ఒక్క యూనిట్ ఎక్కువ వినియోగం జరిగినా పూర్తి బిల్లు చె ల్లించాల్సిందే. అయితే 200 యూనిట్లకంటే తక్కువ వినియోగించే గహాల సంఖ్య క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం.
