నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు
వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ పొనుగోటి గోపాల్, వేములపల్లి సుబ్బారావు, అధ్యక్షులుగా నాగిశెట్టి ప్రసాద్ ,ప్రధాన కార్యదర్శిగా మోతే ఇంద్రసేనారెడ్డి, కోశాధికారిగా డాక్టర్ పెండెం భాస్కర్,కమిటీ సభ్యులుగా వెంకట్, రామ్ రాజ్,భాస్కర్ రెడ్డి,సురేష్ మరియు శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ నేటి ఉరుకులు పరుగుల ఒత్తిడిమయ జీవన విధానంలో నడక అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని క్రమం తప్పకుండా ప్రతీ ఒక్కరూ వాకింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గౌరవ ఆధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ జిమ్ సెంటర్, యోగా కేంద్రాల అభివృద్ధి, వాకింగ్ ట్రాకుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.వాకింగ్ అసోసియేషన్ తరపున హరితహారం విద్యా, వైద్యపరంగా అవసరమైన పేదలకు సామాజిక కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, వీరారెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణ, అమీన్, రాజెశ్వర్ రావు, శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రభాకర్, బద్రు, రవిందర్ వాకర్స్ అసోసియేషన్ పాల్గొన్నారు.