నేటిధాత్రి, వరంగల్
పిఆర్టియు టిఎస్ వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా జిల్లా పరిషత్ హైస్కూల్ కొండూరులో పనిచేస్తున్న కటకం రఘును వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కటకం రఘు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో శక్తివంచన లేకుండా పనిచేసి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నా ఎన్నికకు సహకరించిన పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డికి, వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈదునూరి రవీందర్ రెడ్డి, అబ్దుల్ గఫార్ లకు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆవుల రవీందర్, ప్రవీణ్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.