ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుంది : పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు

నల్లబెల్లి మండలంలో జరుగుతున్న మండల పరిషత్‌ ,జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్షంగా అన్ని స్థానాలతో పాటు జడ్పీటిసి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అని నర్సంపేట శాసన సభ్యులు  .శుక్రవారం నర్సంపేట డివిజన్‌లోని ఖానాపురం, నల్లబెల్లి మండలాల్లో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ రెండవ విడత ఎన్నికలు జరిగాయి. నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి నల్లబెల్లి టీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి పెద్ది స్వప్నతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ గత ఇరవైఅయిదు సంవత్సరాలుగా నల్లబెల్లి మండల ప్రజలకు ప్రజాసేవ చేస్తున్నానని, ఇక్కడి నుండే తనకు రాజకీయ అవకాశం వచ్చిందని, నల్లబెల్లి మండల ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని తెలిపారు. తన సతీమణి స్వప్నకు అధిష్టానం జడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం కల్పించిందని అన్నారు .

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నా సతీమణికి జడ్పీటీసీ అవకాశం దక్కనందున కొందరు ఆరోపణలు చేశారని తెలుపుతూ తన ప్రచారానికి ఒక్కరోజు కూడా రాలేదన్నారు .అయినప్పటికీ మండల ప్రజలు ,ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఎంతో విశ్వాసంతో ఆమె గెలుపు కోసం ఎవరికి వారిగా కషి చేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని అన్ని జడ్పీటీసీ స్థానాలలో నల్లబెల్లి నుండి పదివేల మెజారిటీ వస్తుందని విశ్వాసంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్‌ పదవిపై వస్తున్న ప్రచారం పట్ల అడుగగా అధిష్టానం మేరకు నడుచుకుంటానని ఇప్పటికీ త్పత్తి కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వివరించారు. జడ్పిటిసి అభ్యర్థి పెద్ది స్వప్న సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలకు సెవా వేసేందుకు తెలంగాణ ఉద్యమకారురాలుగా ఎన్నికల బరిలో దిగానని ఆమె తెలిపారు. మండల ప్రజలు, పార్టీ శ్రేణులు తనకు జడ్పిటిసిగా పట్టం కట్టడానికి ఏకాభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ బాటలో నడుస్తామని తెలుపుతూ పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామని స్వప్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి సర్పంచ్‌ రాజారాం, నాయకులు సట్ల శ్రీనివాస్‌ గౌడ్‌, దార్ల రమాదేవి ,మాజీ సర్పంచ్‌ కోటిలింగాచారిలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!