క్యాతన్ పల్లి మున్సిపాలిటీ సమస్యల పరిష్కారానికి కృషి…

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ సమస్యల పరిష్కారానికి కృషి…

మున్సిపల్ ఛైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి

స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి…

మున్సిపల్ వైస్ చైర్మన్ మిట్టపల్లి సరిత

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి అన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొస్తామని, స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత అన్నారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి, వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత, బిఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు సోమవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రామాలయం చౌరస్తాలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి ,రాజీవ్ చౌక్ చౌరస్తా మీదుగా మునిసిపాలిటీ కార్యాలయానికి భారీ జన సందోహం మధ్య డప్పు చప్పుల్లతో మునిసిపాలిటీ కార్యాలయానికి బయలుదేరారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో నూతన చైర్ పర్సన్ గా సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ గా మిట్టపల్లి సరిత పదవీ బాధ్యతలు చేపట్టారు. మున్సిపాలిటీ కార్యాలయంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో రిజిస్టర్ లో మొదటి సంతకం చేశారు.

నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన చైర్పర్సన్ ,వైస్ చైర్ పర్సన్ లకు కమిషనర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఛైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత లు మాట్లాడారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అంకిత భావంతో పనిచేస్తామని అన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందు వరసలో నిలుపుతామని స్పష్టం చేశారు. పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం అత్యంత కీలకమైన దస్త్రాలపై తొలి సంతకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ సీనియర్ నాయకులు రామిడి కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ మెంబర్లు, బిఆర్ఎస్, సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version