అదుపు తప్పుతున్న తినుబండరాల విక్రయాలు…

అదుపు తప్పుతున్న తినుబండరాల విక్రయాలు

సినిమా హాళ్లలో ఉన్నదాని కంటే అధిక ధరల అమ్మకం

పరకాల,నేటిధాత్రి

పట్టణంలో అడ్రెస్స్,తయారీ తేదీ,గడువు తేదీ లేని తినుబండరాల విక్రయాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.బస్టాండ్ లల్లో,కిరాణా దుకాణాలు,రోడ్డు పక్కన ఉన్న బండ్లతో పాటు సినిమా హాళ్లలో కూడా ఈ తరహా ప్యాకెట్లు విస్తృతంగా అమ్ముడవుతున్నాయి.లేబుల్ వివరాలు లేకుండా విక్రయిస్తున్న ఈ తినుబండరాలు వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా కొనుగోలు చేసే చిప్స్,బిస్కెట్లు,స్వీట్లు వంటి ఉత్పత్తులు నాణ్యతపై అనుమానాలు కలిగిస్తున్నాయి.ఇదిలా ఉంటే, సినిమా హాళ్లలో రూ.10 ధర ఉన్న పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు.సాధారణంగా బయట లభించే ధర కంటే ఎక్కువగా వసూలు చేయడం వినియోగదారులకు భారంగా మారింది.అదనంగా,పార్కింగ్ సదుపాయం పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు.సరైన రసీదు ఇవ్వకుండా డబ్బులు తీసుకోవడం కూడా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ పరిస్థితులపై సంబంధిత ఆహార భద్రతా అధికారులు, మున్సిపల్ అధికారులు దృష్టి సారించి,అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మున్సిపల్ కమిషనర్ అంజయ్య వివరణ…

అదుపుతపుతున్న తినుబండారాలు,అక్రమంగా సినిమా హాల్లో,బస్టాండ్ లో, కిరాణా షాపులో సైతం కల్తీ తిను బండారాలు అమ్ముతున్నట్లు స్థానికులు తెలిపారు.ఇట్టి విషయమై పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య ను మంగళవారం “నేటి ధాత్రి” చరవాణి ద్వారా వివరనా కోరగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మా దృష్టికి రాలేదని తెలిపారు.ఎక్కడైనా కల్తీ విక్రయాలు నిర్వహిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ అంజయ్య “నేటి ధాత్రి”తో తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version