పోలింగ్ శాతం పెంచే విధంగా కృషి చేయాలి

పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్

భూపాలపల్లి నేటిధాత్రి

పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ అన్నారు.
గురువారం భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు, కమలాపురం, అజాం నగర్ లలో పోలింగ్ కేంద్రాలను
తనిఖీ చేసి అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, ఎస్పి కిరణ్ ఖరే తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ మాట్లాడుతూ గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లుకు మౌలిక సదుపాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఓటర్లుకు ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేవిధంగా టెంట్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం మరుగుదొడ్లు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
పోలింగ్ కేంద్రాలలో ఓటర్లుకు అభ్యర్థుల గుర్తులు స్పష్టంగా కనపడే విధంగా లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వికలాంగులు, వయో వృద్ధుల కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంపులు, వీల్ ఛైర్స్ అందుబాటులో ఉంచాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు గ్రామస్థాయి నుండి ఓటర్లుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్ట్రాంగ్ రూము వద్ద 24/7 సీఆర్పీఎఫ్ భద్రతా దళాల పటిష్ట నిఘా ఉండాలని అన్నారు. సి సి కెమెరాలను, విజటర్స్, సిబ్బంది విధుల రిజిస్టర్ పరిశీలించారు. జిల్లాకు విచ్చేసిన ఆమెకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా, ఎస్పి కిరణ్ ఖరే పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి
నియోజకవర్గ పరిధిలో లోక్ సభ ఎన్నికల నిర్వహణకై చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా అబ్జర్వర్ కు క్లుప్తంగా వివరించారు.
ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి సంజీవరావు, ఆర్డిఓ మంగిలాల్, డిఎస్పీ సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!