గ్రామసర్పంచ్ కందగట్ల రవి
శాయంపేట నేటిధాత్రి :
శాయంపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ76 వర్ధంతిని పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయికృష్ణ మాట్లాడుతూ బ్యాక్టీరియా వలన కుష్టి వ్యాధి వస్తుందని, చర్మానికి, నరాలకు ఈ వ్యాధి సోకుతుందన్నారు. వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి 3 నుండి 5 ఏళ్ల కాలం పడుతుందని, దీనికి లింగ బేధం, వయస్సుతో సంబంధం లేదన్నారు. వంశపారంపర్యంగా సంభవించే వ్యాధి కాదన్నారు. ఈ వ్యాధిని ఎం డి టి చికిత్సతో 6 నెలల నుండి 12 నెలల్లో పూర్తిగా నయం చేసుకోవచ్చ న్నారు. చర్మంపై ఏ రకమైన మచ్చలు ఉన్న సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని, కుష్టు వ్యాధి పట్ల ఉన్న భయాన్ని విడనాడాలని డాక్టర్ సాయికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత సొసైటీ మాజీ కార్యదర్శి మామిడి అశోక్, పంచాయతీ కార్యదర్శి మడికొండ రత్నాకర్, లైన్ ఇన్స్పెక్టర్ దామోదర్, నాయకులు బూర కుమారస్వామి, ధైనంపల్లి బాబు, వైద్య సిబ్బంది వెంకటేశ్వర వర్మ, చలపతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.