హన్మకొండ, నేటిధాత్రి:
మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ది
సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలని హనుమకొండ లోని అంబేద్కర్ సర్కిల్లో దహనం చేయడం జరిగింది.
మహాజన నేత గౌ శ్రీ మంద కృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా మాదిగల ద్రోహి మరియు మాదిగలకు వచ్చే ప్రతి పదవిని పూటకో పార్టీ మారుస్తూ మాదిగల పదవులను మోసపూరితంగా తీసుకుంటున్న కడియం శ్రీహరి యొక్క కూతురు కడియం కావ్యకూ వరంగల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ ఇవ్వడన్ని వ్యతిరేకిస్తూ …
మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ , ఎమ్మెస్పి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ది మరియు సీఎం రేవంత్ రెడ్డి ల దిష్టి బొమ్మ దహనం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కడియం శ్రీహరి పెద్ద మోసగాడు అని పదవుల కోసం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి అక్కడ ఉండే మాదిగల పదవులు కుట్ర పూరితంగా తీసుకుంటాడు అని అలాంటి కడియం శ్రీహరి కూతురు కావ్యను ఈ ఎంపీ ఎలెక్షన్లో ఓడ గొడుతమని అన్నారు. తన స్వార్థం మాత్రమే చూస్కునే కడియం శ్రీహరిని దలిత జాతి ఎప్పటికీ నమ్మధని హెచ్చరించారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వకుండా మాదిగలను రాజకీయంగా అనచివెస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ ఎంపీ ఎన్నికల్లో మాదిగలు ఓట్లు వేసి బుద్ధి చెప్పాలని మాదిగలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో …
ఎమ్మెస్పి జాతీయ నాయకులు
మంద కుమార్ మాదిగ ,
వేల్పుల సూరన్న కాపు ,
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు
గద్దల సుకుమార్ మాదిగ ,
ఎమ్మెస్పి జిల్లా అధ్యక్షులు
బండారి సురేందర్ మాదిగ ,
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు
రేణుకుంట్ల ఉమ మహేష్ మాదిగ ,
ఎం వై యస్ మాజీ రాష్ట్ర నాయకులు
చేతల్ల శివ మాదిగ ,ఎమ్మెస్పి సీనియర్ నాయకులు అక్కేనకుంట వెంకట స్వామి మాదిగ ,జేరిపోతుల సారంగపాణిమాదిగ ,ఎమ్మెస్పి జిల్లా కార్యదర్శి రాజరపు కిరణ్ మాదిగ ,నద్దునూరి కిరణ్ మాదిగ ,కుమ్మరి శ్రీనివాస్ మాదిగ ,తిప్పరపు మల్లేష్ మాదిగ ,ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మంద స్వరాజ్ మాదిగ ,శుంచు రజినీ కుమార్ మాదిగ ,ఎమ్మార్పీఎస్ నాయకులు రాజరపు క్రాంతి మాదిగ ,జేరిపోతుల కరుణాకర్మాదిగ ,ఎమ్మార్పీఎస్ , ఎమ్మెస్పి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .