`హెచ్చరికలకు అర్థం…రానుందా ప్రళయం!
`గోదావరి పరివాహక ప్రాంతం కదలికలు నిండిన భూ అంతర్భాగం.
`భూకంపం…ఏమరపాటుగా వుంటే ఎంతో ప్రమాదం.
`ఇప్పటికైనా జాగ్రత్త ఎంతో అవసరం!
`రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.3 అంటే సామాన్యమైన విషయం కాదు.
`గోదావరి నదీ పరివాహక ప్రాంతం భూ కంపాలకు కేంద్రం.
`భూమిలోపల 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం.
`ఒకవేళ అదే భూ కంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడితే ప్రమాదం ఊహకందనంతా వుండేది.
`5.3 అనే సంకేతం భవిష్యత్తు విపత్తుకు ముందుస్తు హెచ్చరిక.
`గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలలో బొగ్గు గనుల అడుగున కదలికలు.
`ములుగు అటవీ ప్రాంతంలో చెట్లు కూలిపోవడంతో తొలి హెచ్చరిక జారీ.
`ఇప్పుడు వచ్చిన కదలిక రెండో సూచిక.
`భూకంప కేంద్రం లోతు ఎక్కువ కావడంతో తప్పిన పెను ప్రమాదం.
`భూమి పైపొర క్రిఫ్టోలో వచ్చి వుంటే జరిగేది విధ్వంసమే!
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో తాజాగా బుధవారం ఉదయం వచ్చిన భూకంపం…దేనికి సంకేతం! అనే ప్రశ్న ఇప్పుడు భూ భౌతిక శాస్త్ర పరిశోధకులకు అంతకు చిక్కకుండా పోతోంది. నిజానికి తెలంగాణతో పాటు ఆంద్రప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాలకు భూకంప ప్రభావం పెద్దగా వుండకపోవచ్చని అనుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం జోన్ 2 లో వుండడం వల్ల ప్రజలు ఇప్పటి వరకు నిశ్చింతగానే వుంటూ వస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకన్నా ఇప్పటికీ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు భూకంప ప్రభావానికి లోను కావొచ్చేమో కానీ తీవ్రతల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కానీ పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా వుంటాయని అనుకోలేం. ఇప్పటి వరకు తెలంగాణ ఎప్పుడూ ఇంతలా ఉలిక్కిపడిన సందర్భం లేదు. సహజంగా భూకంపాలు సముద్ర గర్భాలలోనే వస్తుంటాయి. ప్రపంచంలో అత్యధిక తీవ్రత కలిగిన భూకంపాలు సముద్రాలలోనే నమోదౌతుంటాయి. ఖండాంతార్గత భూకంపాలు అంత తీవ్రంగా వచ్చిన దాఖలాలు లేవు. సముద్రాలలో వచ్చిన భూ కంపాల మూలంగానే ఖండాలు ఏర్పడడం జరిగింది. అనేక భూభాగాలు సముద్రాలలో కలిసిపోవడం జరిగింది. భవిష్యత్తులో సముద్రాలలో వచ్చే భూ కంపాల మూలంగా సముద్ర తీర ప్రాంతాలెన్నో మాయమయ్యే అవకాశం వుంది. అయితే ఇక్కడ మరో రకమైన ఆవిర్భావాలు కూడా జరిగే అవకాశం వుంది. సముద్రాలలో వచ్చే భూ కంపాల మూలంగా సముద్ర గర్భాలు పైకి వచ్చి భూ భాగాలు పైకి వచ్చే అవకాశం వుంది. మన దేశానికి ఉత్తరాన వున్న హిమాలయ ప్రాంతాలలో ఒకప్పుడు టెథిస్ అనే సముద్రం వుండేది. అది భూకంపాల మూలంగా మాయమైపోయింది. హిమాలయాలు పైకి చొచ్చుకొని వచ్చాయి. అందుకే ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో భూకంపాలు సంభవిస్తూనే వుంటాయి. మన దేశానికి ఆనుకొని వున్న పాకిస్తాన్, చైనా, నేపాల్ దేశాలలో కూడా ఎక్కువగా భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం కూడా అదే. గతంలో చైనాలో వచ్చిన భూకంపాల మూలంగా కొన్ని లక్షల మంది మరణించిన సందర్బాలున్నాయి. నేపాల్ లో తరుచుగా భూకంపాలు వస్తూనే వుంటాయి. ఆ మధ్య వచ్చిన భూకంపాల మూలంగా నేపాల్ రాజధాని ఖాట్మండ్ రూపురేఖలు మారిపోయాయి. వందలాది మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక చారిత్రక కట్టడాలు కూలిపోయాయి. ఆ మధ్య పాకిస్తాన్ లో వచ్చిన భూకంపం మూలంగా మన దేశ రాజధాని డిల్లీలో కూడా కంపనాలు వచ్చాయి. గుజరాత్ లో ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన భూకంపం ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలో వచ్చిన భూకంపం అనేక మంది ప్రాణాలు బలితీసుకున్నది. సముద్ర తీర ప్రాంతాలలో మన దేశంలో గుజరాత్, మహారాష్ట్రలలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రస్తుతం సముద్రాలలో కనిపించే అనేక దీవులు ఇలా ఏర్పడినవే కావడం విశేషం. మన దేశంలో అంతర్భాగాలైన అండమాన్, నికోబార్ దీవులు కూడా ఇలా ఏర్పడినవే కావడం విశేషం. ఎక్కువగా భూ కంపాలు సంభవించే ప్రాంతాలలో అగ్ని పర్వతాలు అనేకం వుంటాయి. అలాంటి అగ్ని పర్వతాలలో క్రియాశీల పర్వతాల సమీపంలోనే భూకంపాలు సంభవిస్తుంటాయి. నిద్రాణ అగ్ని పర్వత ప్రాంతాలలో భూకంపాలు తక్కువగా వస్తుంటాయి. జపాన్, ఇండోనేషియా, బాలి వంటి ద్వీప దేశాలలో వచ్చే భూకంపాలకు లెక్కే వుండదు. జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణం. ఇలా చెప్పుకుంటూ పోతే భూకంపాలకు గురికాని ప్రాంతాలంటూ ఈ భూమి మీద వుండవు. అయితే భూకంపాల మూలంగా మానవాళికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. అయితే భూ అంతర్భాగంలో వుంటే అనేక రకాలైన ఖనిజాల తభ్యత కూడా భూకంపాల మూలంగానే మనకు ఉపయోగపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వున్న బొగ్గు నిక్షేపాలు భూకంపాల మూలంగా ఏర్పడినవే. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద సంభవించిన భూకంపాల వల్ల భూమిలోకి వెళ్లిపోయిన వృక్ష సంపద భూ అంతర్భాగంలో జరిగే ఘర్షణల మూలంగా మండి, బొగ్గుగా మారిపోయాయి. ఇప్పుడు అవే మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన దేశంలో గంగా, గోదావరి నదీ పరివాహక ప్రాంతలలో పెద్ద ఎత్తున బొగ్గు గనులు నిక్షిప్తమై వున్నాయి. వాటిని మనం నిత్యం కొన్ని వేల టన్నులు వెలికితీస్తున్నాం. మన దేశంలో వున్న అన్ని బొగ్గు నిక్షేపాలలో ఈ తవ్వకాలు కొన్ని వందల సంవత్సరాలుగా సాగుతున్నాయి. సహజంగా బొగ్గు గనుల విస్తారంగా వున్న ప్రాంతాలన్నీ బలహీనంగా వుంటాయి. అలాంటి ప్రాంతాలలో మైనింగ్ కోసం నిత్యం వాటిలో పెద్ద ఎత్తున బాంబులను వినియోగిస్తుంటాము. దాంతో భూగర్భంలో కదలికలు వస్తుంటాయి. భూ అంతర్భాగంలోకి తవ్వకాల రూపంలో లోతుకు వెళ్లడం మూలంగా అక్కడ గుల్లగా మారిన ప్రాంతాన్ని భూమి పూడ్చుకుంటుంది. దాంతో ఆ ప్రాంతంలో భూమి కదులుతుంది. అదే భూకంపంగా మారుతుంది. భూమి లో ముఖ్యంగా మూడు పొరలుంటాయి. భూమి పైన ఎనిమిది కిలోమీటర్ల లోతు వరకు క్రస్ట్ అనే పొరగా గుర్తించారు. సహజంగా ఈ పొరలోనే ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇవి కాకుండా మధ్యస్థ పొరలలో కూడా సర్థుబాట్లు చేసుకుంటాయి. భూమిలో ముఖ్యంగా మూడు భూకంప తరంగాలు ఎప్పుడూ ప్రసరిస్తూనే వుంటాయి. వాటిలో పి తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు వుంటాయి. మామూలుగా పి, ఎస్ తరంగాలు వల్ల వచ్చే భూకంపాల వల్ల పెద్ద నష్టం జరగదు. కానీ ఎల్ తరంగాలు మాత్రమే పైకి నిటారుగా దూసుకొని వస్తుంటాయి. వాటికి పి, ఎస్ తరంగాలు తోడైతే మాత్రం ఆ భూకంపాలు విలయం సృష్టిస్తాయి. అప్పుడు సముద్రాలలో సునామీలు వస్తుంటాయి. అనేక దేశాలు అతలా కుతలమౌతాయి. అందువల్ల సముద్ర తీర ప్రాంతాలు అధికంగా వున్న మన దేశంలో భూ అంతర్భాగంలో భూకంపాల సహజం. నిత్యం కొన్ని వందల భూకంపాలు నమోదౌతూనే వుంటాయి. కాకపోతే వాటి తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5కు మించితే మాత్రం ప్రమాదకరమనే చెప్పాలి. ప్రస్తుతం ములుగు కేంద్రంగా ఏర్పడిన భూకంపం లోతు చాలా ఎక్కువ. అది సుమారు 40 కిలోమీటర్ల లోతున ఏర్పడిరది. కాకపోతే అంత తీవ్రతతో పైకి రాలేదు. సహజంగా అంత లోతులో భూకంప కేంద్రం ఏర్పడడం అంటే పెద్ద ఉత్పాతానికి సంకేతమనే చెప్పాలి. అంత లోతులో బలమైన భూకంపం ఏర్పడి, వాటికి పి,ఎస్ తరంగాలు తోడైతే దాని ప్రభావం ఊహించడానికి కూడా కష్టం. ఆ మధ్య ములుగు జిల్లాలో సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో అటవీ ప్రాంతంలో చెట్లన్ని పెద్ద ఎత్తున నేలకొరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే ప్రదేశంలో భూకంప కేంద్రం ఏర్పడిరది. పైగా గతంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు పగుళ్లు వచ్చాయి. అంటే బొగ్గు గనులు విస్తారంగా వున్న ఈ ప్రాంతంలో భూకంపాలు రానున్నట్లు ముందస్తు సమాచారమనే చెప్పాలి. అయితే మన దగ్గర వున్న బొగ్గు గనులు అతి బలమైనవి. ఇవి అత్యంత నాణ్యత కలిగి, గట్టితనం కలిగిన బొగ్గు కాదు. బొగ్గులలో బిట్యుమినన్, లిగ్నైట్, ఆంత్రసైట్ రకాలుంటాయి. బిట్యుమినన్ అత్యంత గట్టి బొగ్గు. గనులు కూడా అంత గట్టిగా వుంటాయి. మన సింగరేణి ఉత్పత్తి చేసేది ఆంత్రసైట్ బొగ్గు. ఈ బొగ్గు గనుల ప్రాంతం గుల్లగుల్లగా వుంటుంది. ఆయా ప్రాంతాలలో గనుల తవ్వకం మూలంగా మరింత భూమిలో సందులు ఏర్పడుతున్నాయి. ఇది తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత ప్రమాదకరం. దాని సంకేతమే వచ్చిన భూకంపానికి నిదర్శనం.