
Grand Durga Devi Procession in Ramakrishnapur
రామకృష్ణాపూర్ లో వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర…
మహిళలు, యువతులు అద్భుతమైన నృత్యాలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి విగ్రహాలను శనివారం నిమజ్జనం చేసేందుకు రామకృష్ణాపూర్ పట్టణంలోనీ దుర్గామాతలకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా మండపాల నిర్వాహకులు దుర్గమాత విగ్రహాలను అందంగా అలంకరించి పట్టణంలో శోభా యాత్ర నిర్వహించారు. మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీదుల గుండా భాజ భజంత్రీలతో, డప్పు చప్పుల్ల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు. మహిళలు మంగళ హరతులతో ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శరన్నవరాత్రుల సందర్భంగా సిహెచ్పి, బీజోన్ సెంటర్, ఏజోన్, రామాలయం, రాజీవ్ చౌక్, సూపర్ బజార్, సాయిబాబా మందిరం ల వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలకు శోభాయాత్ర కన్నుల పండువగా చేపట్టారు. చివరి రోజు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని ఆనందోత్సవాల మధ్య భాజాభజంత్రీలతో శోభాయాత్ర నిర్వహించారు.మహిళలు దాండియా, కోలాటం ఆడారు. అనంతరం భక్తులు సమీప గోదావరి నది వద్దకు దుర్గామాత నిమజ్జనానికై తరలి వెళ్లారు.