
Dr. Vivek Ensures Road Access for Maripedu School
పాఠశాల దారికి పరిష్కారం చూపిన DSFI జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్
మరిపెడ నేటిధాత్రి
మరిపెడ మండలం ఎల్లంపేట శివారు మంచ్య తండా ప్రాథమిక పాఠశాలలో దాదాపు 22 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న తరుణంలో వారికి పాఠశాలకు రావడానికి మార్గం లేక అనేక అవస్థలు పడుతున్నారని డిఎస్ఎఫ్ఐ నేతలకు సమాచారం రాగా వెంటనే ఆ తండా పాఠశాలకు వెళ్లడం జరిగింది, పొలం గట్టే విద్యార్థులకు దారిగా మారిందని వర్షం వస్తే పిల్లలు కింద పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు,అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి 4 ఫీట్ల రోడ్డును ఇవ్వాలని కోరగా రైతులు అంగీకరించారు,అదే సమయంలో జిల్లా విద్యాశాఖ అధికారి డిఈవొ రవీందర్ రెడ్డి తో మాట్లాడి తక్షణమే ఆ పాఠశాలకు రోడ్డు శాంక్షన్ చేయాలని కోరగా, డీఈవో సానుకూలంగా స్పందించి కలెక్టర్ తో మాట్లాడి కచ్చితంగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు,డాక్టర్ వివేక్ తో పాటు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్ర వీరభద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెలోత్ సాయికుమార్, రాష్ట్ర కోశాధికారి గుగులోతు సూర్యప్రకాష్, కోర్ కమిటీ సభ్యులు ఎర్ర దిలీప్, డాక్టర్ వివేక్ వ్యక్తిగత సహాయకుడు శివ వర్మ, డిఎస్ఎఫ్ఐ నేతలు రమేష్,ఎర్ర నితీష్, లేవి జియాన్ చరణ్,మురళి,విష్ణు,సాయి,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.