వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
హైదరాబాద్, నేటిధాత్రి:
కేంద్ర మాజీమంత్రి బెస్ట్ పార్లమెంట్ ఏరియల్ దివంగత జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా డాక్టర్ రామకృష్ణ పాల్గోని నివాళులు అర్పించారు,
అనంతరం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ
తెలంగాణ రావడానికి ముఖ్యపాత్ర పోషించిన జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను మరియు జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి మామ పద్మాకర్ రెడ్డి చిన్న మామ మనోహర్ రెడ్డి సతీమణి గీత అక్క నీ వారి కుటుంబ సభ్యులందరిని వరంగల్ ఎంపీ అస్పిరేంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అదేవిధంగా వరంగల్ నాయకులు జోసెఫ్ ప్రభాకర్ లాజరస్, సామ్ ఎలియా మహేష్ మరియు మధు తదితరులు పాల్గొన్నారు.