*ఏజెన్సీలో డాక్టర్ గీతా పావని వైద్య సేవలు అభినందనీయం.
కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ వైద్య నిపుణురాలిని అభినందించిన ఐద్వా*
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం వంటి ఏజెన్సీ ప్రాంతంలో మహిళ కిడ్నీ వైద్యురాలు ఉండటం ఎంతో అవసరం అని గుర్తించి ఇతర ప్రాంతాలలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో భద్రాచలం పట్టణంలో సూర్య ఆసుపత్రిని నెలకొల్పి ఈ ప్రాంత ప్రజలకు కిడ్నీ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గీత పావని అభినందినియురాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి సీనియర్ నాయకురాలు నాదెండ్ల లీలావతి అన్నారు. గురువారం ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సూర్య హాస్పిటల్స్ కిడ్నీ వైద్య నిపుణురాలు డాక్టర్ గీత పావని శాలువా తో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సీత లక్ష్మీ లీలావతి లు మాట్లాడుతూ ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో సూర్య ఆస్పత్రిని నెలకొల్పటమే కాక డయాలసిస్ సెంటర్ ను కూడా అందుబాటులో తీసుకురావడం అభినందనీయమని అన్నారు. చిన్న వయసులోనే వైద్య వృత్తిలో రాణిస్తున్న గీత పావని భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఏజెన్సీలో అనునిత్యం కిడ్నీ సంబంధిత వ్యాధులు వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్ ఖమ్మం విజయవాడ వంటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నుండి ఇక్కడే అన్ని రకాల కిడ్నీ వైద్య సేవలు అందడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు జి జీవనజ్యోతి వై పూర్ణిమ నాగలక్ష్మి కనక శ్రీ తదితరులు పాల్గొన్నారు