మల్లాపూర్ ఏప్రిల్ 16 నేటి ధాత్రి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిన వాటిని బేకాతరు చేస్తూ మండల మరియు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు అధికారికంగా చేయవలసిన అప్పటి కూడా కనీసం గ్రామాలలో కూడా రాలేదు జయంతి ఉత్సవాలను చేయలేదు.

దాదాపు 14 గ్రామాలలో కార్యదర్శులు కార్యక్రమాలు నిర్వహించలేదు అని ఉన్న సమాచారం. మరియు మండల అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఎందుకు వివక్షత, దళితులు అంటే ఎందుకు చిన్న చూపు ఈ ఆదేశాలలో దళిత ఆర్గనైజేషన్లను కలుపుకొని కార్యక్రమాలు చేయాలని కలెక్టర్ మెన్షన్ చేసి ఉన్నప్పటి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి 14 గ్రామాలలో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించని కార్యదర్శిలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

లేనిచో మండల కేంద్రంలో నిరసనలు చేపడుతాం రాష్ట్ర ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేస్తాం. మన మండలంలో 23 గ్రామాలు ఉంటే దాదాపు 14 గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు జయంతి రోజు కనీసం గ్రామాలకు కూడా రాలేదు. మండల ఆఫీసులో చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో కూడా పాల్గొనలేదు. ఎప్పుడో ఈ విషయంపై కంప్లైంట్ చేయడానికి వెళితే అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని చెత్తబుట్టల పక్కన పెట్టడం జరిగింది. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయం కలెక్టర్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.