పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణం నుండి నార్లపూర్ కి వెళ్లే రవాణా మార్గంలో నూతన రోడ్డు కై గుంతలను తవ్వడం జరిగింది.పని కొంతవరకు పూర్తి అయినా కూడా కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని గత కొద్దీరోజుల కిందట నేటిధాత్రి రిపోర్టర్ వార్త రాయడం జరిగింది.సంబదించిన అధికారులు గాని కాంట్రాక్టర్ గాని కనీస స్పందన లేకుండా చెవుమీద పేను పారానట్టుగా వ్యవహారిస్తున్నారు.వాహనదారుల ప్రాణాలలతో చలగాటమాడుతున్నారు.కొద్దీ రోజుల కిందట ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురి కావడం జరిగింది వాహనదారుడు చిన్న చిన్న గాయలతో బయటపడ్డాడు.నేటిధాత్రి ప్రజల తరుపున ప్రశ్నిస్తుందని గుర్తుచేస్తూ ఇప్పటికైనా స్పందించి ప్రమాద హెచ్చరికి బోర్డులను ఏర్పాటు చేయాలి.
స్పందనే లేదేందుకు ప్రమాదమంటే పట్టించుకోరా
