దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు
– ఉద్యోగుల అకౌంట్లలో దొంగ సొమ్ము జమ
– సూపరింటెండెంట్ పనేనని అనుమానం
– డిఐఈవోకు తెలిసే జరిగింది…?
– వాటాల పంపకంలో మనస్పర్ధాలు..
వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్ జిల్లా కార్యాలయంలో జరిగిన అవినీతిలో కొందరి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మధ్య పంపకాల విషయంలో తలెత్తిన వివాదంతో డిఐఈవో కార్యాలయంలో జరిగిన అవినీతి విషయం బయటికొచ్చినట్టు తెలుస్తున్నది. కార్యాలయంలోని సూపరింటెండెంట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సహాయంతో క్యాంపునకు సంబంధంలేని వ్యక్తుల అకౌంట్లను సేకరించి తప్పుడు పేర్లను సృష్టించి దొంగ లెక్కలురాసి వారి అకౌంట్లలో జమచేశారని సమాచారం. ఇలా కలెక్ట్‌చేసిన అకౌంట్లలో డబ్డులు వేసి స్వయంగా సూపరింటెండెంట్ మళ్లి తిరిగి ఇవ్వాలని అడగటంతో అసలు కథ ఇక్కడ అడ్డం తిరిగింది. అకౌంట్లలో పడిన డబ్బులకు పర్సంటేజి ఇస్తానని తీసుకొని వారికి కమీషన్ ఇవ్వకపోవడంతో కొందరు గొడవ చేయడంతో ఈ కథ బయటికొచ్చింది. ఓ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి క్యాంపు ఆఫీస్‌లో పనిచేయని కొంతమందితోపాటు వారి బంధువుల అకౌంట్లను సేకరించి సూపరింటెండెంట్‌కు ఇచ్చాడు. ఇలా ఇచ్చిన అకౌంట్లలో ఆయన డబ్బులు చెక్కుల ద్వారా జమ చేయడం జరిగింది. తిరిగి ఇచ్చే క్రమంలో ఈ విషయంలో కొంతమందికి గొడవ జరగటంతో అసలు విషయం బయటికొచ్చింది.
(ఎవరా…సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి….వివరాలు త్వరలో)