
NRI Dr. Gatla Narsingam
విరాళంగా కంప్యూటర్ ల్యాబ్ కు లక్ష రూపాయలు
నేటి ధాత్రి కథలాపూర్
అందజేసిన ఎన్ ఆర్ ఐ డా. గట్ల నర్సింగం
కథలాపూర్, ఆగస్టు 16 : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ కొరకు లక్ష రూపాయలను ఎన్ ఆర్ ఐ డా. గట్ల నర్సింగం విరాళంగా అందజేశారు. శనివారం
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ కు సిరికొండ గ్రామానికి చెందిన అమెరికా ప్రవాస భారతీయులు డా. గట్ల నర్సింగం 1 లక్ష రూపాయలు విరాళం అందజేసినట్టు ప్రధానోపాధ్యాయులు లోకిని శ్రీనివాస్ తెలిపారు. తన మిత్రులైన విశ్రాంత ఉపాద్యాయులు ఒటారికారి చిన్న రాజన్న, డా. వేముల ప్రభాకర్ మిత్ర బృందం పాఠశాలలో నగలు రూపేణా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. నర్సింగం గతంలో కూడా పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారని, పాఠశాల అభివృద్ధికి తన సహకారాన్ని అందించారనీ లోకిని శ్రీనివాస్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా నర్సింగము కు గ్రామస్తులు, ఉపాద్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.