నర్సంపేట,నేటిధాత్రి :
చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోరబోయిన కుమారస్వామి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ,తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు సీపీఎం పార్టీ నర్సంపేట కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కోరబోయిన కుమారస్వామి మాట్లాడుతూ ఆనాడు దొడ్డి కొమురయ్య బలిదానం కొలిమోలే రాజుకొని భూస్వాముల ఆగడాల్నీ కాల్చి బూడిద చేసిందన్నారు.సమాజంలో మార్పు కోసం అంకిత భావంతో పనిచేయడమే దొడ్డి కొమురయ్యకు నిజమైన నివాళి అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, మండల, పట్టణ నాయకులు కందికొండ రాజు, కత్తి కట్టయ్య, పెండ్యాల సారయ్య, రాజులపాటి సూరయ్య,పత్కాల బాబు, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, యాక లక్ష్మి, విలియం కేరి, రాధ, నర్సింహా రాములు తదితరులు పాల్గొన్నారు.