
జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం.
మెల్లచెరువు,నేటిధాత్రి.
ఈరోజు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు ట్రైనీ ఐపిఎస్ అధికారి రాజేష్ మీనా తో కలిసి మేల్లచేరువు మహా శివరాత్రి జాతరకు సంభందించి పోలీసు బందోబస్తు ఏర్పాటు, వాహనాల మళ్లింపు, పార్కింగ్ ప్రదేశాలు, రోడ్డు మార్గాలు, జాతర నిర్వహించే స్థలం, దేవాలయం భద్రత పరిశీలించారు. అనంతరం స్వామివారి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేల్లచేరువు మహాశివరాత్రి జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు, ప్రజలకు భద్రత కల్పిస్తాం అని ఎస్పీ గారు తెలిపినారు. బందోబస్తు ఏర్పాట్ల పై, జాతర నిర్వహణపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. దేవాలయం సిబ్బంది, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల తో సమన్వయంగా పని చేస్తామని తెలిపినారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని దేవాలయ సిబ్బందిని ఆదేశించారు.
జాతరకు వచ్చే భక్తులు వాహనాలు నిలుపుకోవడానికి మేళ్ళచెరువు వచ్చి పోయే అన్ని ప్రధాన మార్గాల్లో పార్కింగ్ ప్రదేశాలు, హోల్డింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశాం అన్నారు. బారికెడ్స్, సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేశాం అన్నారు. జాతరను సీసీ కెమెరాలద్వారా పర్యవేక్షణ చేస్తామని తెలిపినారు. ఎస్పీ గారి వెంట ట్రైనీ ఐపిఎస్ అధికారి రాజేష్ మీనా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్, కోదాడ రూరల్ సర్కిల్ సీఐ రజిత రెడ్డి, స్థానిక ఎస్సై పరమేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సురేష్ యాదవ్, స్థానిక అధికారులు, సిబ్బంది ఉన్నారు.