భూపాలపల్లి నేటిధాత్రి
మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళల భద్రత కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే అన్నారు. మంగళవారం
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం షి టీం, పోస్టర్లను ఎస్పి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పి కిరణ్ ఖరే గారు మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు. మహిళలు సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్త గా ఉండాలన్నారు. ఆకతాయిలు మహిళలను, విధ్యార్ధినిలను వేధింపులకు గురిచేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని, ఈవ్‌టీజింగ్‌కు గురైతే షీటీం వెంటనే స్పందిస్తుందని, మహిళలు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే షీటీం నంబరు 87126 58162 కు కాల్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్, షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర, శిరీష కానిస్టేబుల్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.