Mallesh Blesses Newlywed Couple
నూతన డీఈఓ కి( రేవా) జిల్లా శాఖ ఘన సన్మానం…
మహబూబాబాద్ జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వి. రాజేశ్వరరావు కి( రేవా) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం.
మహబూబాబాద్/ నేటి ధాత్రి
రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డి ఈ ఓ ని మర్యాదపూర్వకంగా కలిసి శలువా తో ఘన సన్మానం చేయడం జరిగిందని తెలిపారు,ఈ సందర్భన్నీ ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ మాట్లాడుతూ ఈ సంవత్సరం 66 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్ జి టి లు మరియు గెజిటెడ్ ప్రధానో ఉపాధ్యాయులు పదవి విరమణ చెందుతున్నారు, వారందరికీ వెను వెంటనే పెన్షన్ మంజూరు ఉత్తరు లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గెస్ట్ ప్రధాన ఉపాధ్యాయులకు ఆర్ జె డి ల ద్వారా ఎలాంటి కాలయాపన లేకుండా పెన్షన్ ఉత్తరులు ఇప్పించాలని కోరారు. తమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పెన్షన్ ర్స్ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శ గుగులోత్ కిషన్ నాయక్, గౌరవ అధ్యక్షులు సోమా గోవర్ధన్, మురళిదరస్వామి, రమేష్ బాబు, నిరంజన్ రెడ్డి, బాణాల గోవర్ధన్,తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
