
# బుస్సాపూర్ దుబ్బగూడెం తాతయ్య పల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
# నీటి సరఫరా తీరు పై స్థానికులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్
ములుగు జిల్లా ప్రతినిధి నేతిధాత్రి
ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని బుస్సాపూర్ దుబ్బగూడెం తాతయ్య పల్లి గ్రామాల్లో నీటి సరఫరా స్థితిగతులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామాల్లో పర్యటించి స్థానికులను నీటి సరఫరా తీరు ను అడిగి తెలుసుకుంటూ ప్రతిరోజు ఎంతసేపు నీరు సరఫరా అవుతుంది? నీటి సరఫరా తీరును అధికారులు పర్యవేక్షిస్తున్నారా? అని క్షేత్ర స్థాయి స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో ఎన్ని నల్లా కనెక్షన్ లు ఉన్నాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకు న్నారు నీటి సరఫరా తీరు ను స్థానికులను అడిగి తెలుసుకొని నీటి వృధా ను అరికట్టాలని, అవసరాల మేరకు నీటిని వినియోగించుకోవా లని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలంలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున గ్రామాలలోని నీటి నిలువలను వృధా చేయకుండా సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరారు. ఏటూరు నాగారం మండలం రాంనగర్, వాజేడు మండలంలోని పూసూరు, రామప్ప సరస్సులోని పంపు హౌస్ ల ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. అధికారుల అంచనాల ప్రకారం ఇప్పటివరకు ములుగు ప్రాంతంలో ఎలాంటి త్రాగునీటి సమస్య లేదని అయినప్పటికీ ప్రజలు త్రాగు నీటని వృధా చేయరాదని నిత్యవసర అవసరాలకు ముడి నీరును ఉపయోగించుకోవాలని కోరారు గ్రామాలలో ఉన్నటువంటి బోర్ వెల్స్ పనితీరును గ్రామాల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రస్తుతం ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుంటూ, గ్రామాల్లో మరమ్మత్తులలో ఉన్న చేతి పంపులు, బోర్లు , మంచినీటి బావులు, తదితర వాటర్ సప్లై వనరులను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో డి ఈ విద్యుత్ నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి హజార్ సయ్యద్, గ్రిడ్ అధికారిని సంధ్యారాణి, ఎంపీడీవో జోహార్ రెడ్డి , ఎంపీ ఓ సాజిదా బేగం, తదితరులు పాల్గొన్నారు