
భూపాలపల్లి నేటిధాత్రి
క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. అనంతరం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను భక్తులు యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటిస్తూ దిగ్విజయంగా జరుపుకున్నారని పేర్కొన్నారు. ఎలాంటి విఘ్నాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో దిగ్విజయంగా జరుపు కున్నారని హర్షం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు జరుగనున్న నిమజ్జన కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీసీ లు ప్రదీప్, సంగీత్,
క్యాంపు కార్యాలయ సిబ్బంది శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.